నిజంగా ఇది నమ్మశక్యం కానీ విషయం.. పెళ్లైన నెలరోజులకే రష్మిక ఎమోషనల్ పోస్ట్

by Mallepaka Hamsa |   (  Updated:2026-03-27 04:27:36  IST  )

పెళ్లి అనేది నాకు ఎప్పుడూ ఒక కలలా అనిపించేది, కానీ ఇప్పుడు అది నిజమై నెల రోజులు పూర్తి చేసుకున్నాం.

నిజంగా ఇది నమ్మశక్యం కానీ విషయం.. పెళ్లైన నెలరోజులకే రష్మిక ఎమోషనల్ పోస్ట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పెళ్లి జరిగి అప్పుడే నెల రోజులు గడిచిపోయింది. ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వీరిద్దరూ ఒక్కటైన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా రష్మిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెళ్లి ఫొటోలను షేర్ చేస్తూ, తన మనసులోని మాటలను ఎంతో ప్రేమగా బయటపెట్టింది. "పెళ్లి జరిగి అప్పుడే ఒక నెల అయిపోయిందంటే నేను నమ్మలేకపోతున్నాను. పెళ్లి అనేది నాకు ఎప్పుడూ ఒక కలలా అనిపించేది, కానీ ఇప్పుడు అది నిజమై నెల రోజులు పూర్తి చేసుకున్నాం" అంటూ రష్మిక తన ఆనందాన్ని పంచుకుంది. ఈ పెళ్లి ప్రయాణంలో తనకు తోడుగా నిలిచిన కొందరు మహిళలను ఆమె రక్షక దేవతలు అని పిలుస్తూ కృతజ్ఞతలు తెలిపింది. ముఖ్యంగా తన స్నేహితురాలు ఐశ్య గురించి చెబుతూ.. "నువ్వు నాకు ఎన్నో ఏళ్లుగా ఒక కొండంత అండగా నిలిచావు. బయట ఎవరికీ చెప్పుకోలేని ఎన్నో విషయాల్లో నువ్వు నాకు తోడుగా ఉన్నావు.

నా మనసులో బాధను ఎవరూ అర్థం చేసుకోలేకపోయినా, నువ్వు మాత్రం నా పక్కనే ఉండి ధైర్యం చెప్పేదానివి. ఈ పెళ్లి ఇంత బాగా జరగడానికి కారణం నువ్వే" అని ఎమోషనల్ అయ్యింది. ఈ పెళ్లి వేడుకను అద్భుతంగా ప్లాన్ చేసిన ప్రియ మాగంటి, అర్పిత మరియు ఈవెంట్ టీమ్‌కు కూడా రష్మిక ప్రత్యేకంగా థాంక్స్ చెప్పింది. "మా ఆలోచనలు కొంచెం వెరైటీగా, పాత పద్ధతులకు భిన్నంగా ఉన్నా సరే.. మీరు ఒక్కసారి కూడా కాదు అనకుండా మా కలను నిజం చేశారు. మా కుటుంబ సభ్యులందరికీ మీ పనితనం చాలా బాగా నచ్చింది" అని ప్రశంసలు కురిపించింది. చివరగా, "మిగతావన్నీ మర్చిపోయి ఈ రోజులను ఎంజాయ్ చేయండి అని చెప్పిన మీ అందరి వల్లే నేను ప్రశాంతంగా ఉండగలిగాను. మీరే నా చిన్న ప్రపంచం" అంటూ రష్మిక పెట్టిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక అది చూసిన నెటిజన్లు రెడ్ హార్ట్ సింబల్స్ షేర్ చేస్తున్నారు.

DishaPatani:ఆస్వాదించండి విమర్శించకండి.. డ్రెస్సింగ్‌పై వస్తున్న ట్రోల్స్‌పై స్పందించిన యంగ్ బ్యూటీ

Next Story