DishaPatani:ఆస్వాదించండి విమర్శించకండి.. డ్రెస్సింగ్‌పై వస్తున్న ట్రోల్స్‌పై స్పందించిన యంగ్ బ్యూటీ

by Chukka Sudharani |

తన డ్రెస్సింగ్ విషయంలో సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్‌పై బోల్డ్ బ్యూటీ దిశా పటాని స్పందిస్తూ ఆవేదన వ్యక్తం చేసింది.

DishaPatani:ఆస్వాదించండి విమర్శించకండి.. డ్రెస్సింగ్‌పై వస్తున్న ట్రోల్స్‌పై స్పందించిన యంగ్ బ్యూటీ
X

దిశ, సినిమా: బిటౌన్ బ్యూటీ దిశా పటాని ‘కల్కి’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన ఈ మూవీలో పాన్ ఇండియా రేంజ్‌లో విజయం అందుకున్నప్పటికీ.. ఇందులో దిశ పాత్రకు మాత్రం అంతగా బజ్ రాలేదు. అయితే.. రీసెంట్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ కల్కి 2లో మాత్రం తన పాత్ర చాలా కీలకంగా ఉండబోతున్నట్లు తెలుపగా ఈ యంగ్ బ్యూటీ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇక సినిమాల విషయం పక్కన పెడితే నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఈ బోల్డ్ బ్యూటీ.. తన గ్లామర్‌తో యూత్‌ను మెస్మరైజ్ చేస్తూ ఉంటుంది. అలాగే బోల్డ్ లుక్‌లో కనిపించడంతో విమర్శలు సైతం ఎదురవుతుంటాయి. ఇందులో భాగంగానే రీసెంట్‌గా ఓ ఈవెంట్‌లో తాను ధరించిన దుస్తులపై నెట్టింట ట్రోల్స్ స్టార్ట్ అయ్యాయి. రీసెంట్ ఇంటర్వ్యూలో నెగిటివ్ కామెంట్స్‌పై స్పందించిన దిశ.. ‘నటీమణులను అభినందించండి తప్ప, వారు ధరించే దుస్తులను విమర్శించకండి. అంతేకాకుండా, ఆకర్షణ అండ్ అసభ్యత మధ్య ఉన్న తేడాను అర్థం చేసుకోకుండా ఎవరూ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టరు. మేము గ్లామర్‌గా ఉండి అందరిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తాం కానీ అసభ్యకరంగా ఉండము’ అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

Next Story