ప్రభాస్-మారుతి సినిమాకు టైటిల్ ఇదే..

by Disha Web Desk 1 |
ప్రభాస్-మారుతి సినిమాకు టైటిల్ ఇదే..
X

దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ రెబెల్ స్టార్ ప్రభాస్, యంగ్ డైరెక్టర్ మారుతి కాంబినేషన్ లో ఓ సినిమా వస్తున్న సంగతి అందరికి తెలిసందే. అయితే, ఈ సినిమాకు 'రాజా డీలక్స్' అనే టైటిల్ ను మూవీ మేకర్స్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. మ్యూజిక్ సెన్సేషన్ థమన్ ఈ మూవీకి సంగీతాన్ని సమకూర్చుతున్నట్లు సమాచారం. ఇప్పటికే.. జూన్ 2023 మొదటి వారంలో ఈ సినిమా కోసం ట్యూన్స్ ప్రిపేర్ చేయనున్నట్లు తెలిసింది. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన మూవీ మేకర్స్ నుంచి వెలువడాల్సి ఉంది. ఈ మూవీలో మాళవిక మోహనన్ కథానాయికగా ఎంపికైంది. క్రైం కామెడీ ట్రాక్ లో రానున్న ఈ చిత్రంలో సంజయ్ దత్ మరియు సత్యరాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మే 2024లో విడుదల చేయడానికి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

Also Read: ఓంకార్ షోలో నటుడు జేడీ చక్రవర్తి బోల్డ్ స్టేట్‌మెంట్.. షాక్‌లో హీరోయిన్లు!

స్టార్ హీరోయిన్లనే మించిపోతున్న శ్రీలీల పారితోషికం!



Next Story

Most Viewed