JD Chakravarthy : ఓంకార్ షోలో నటుడు జేడీ చక్రవర్తి బోల్డ్ స్టేట్‌మెంట్.. షాక్‌లో హీరోయిన్లు!

by Disha Web Desk 9 |
JD Chakravarthy : ఓంకార్ షోలో నటుడు జేడీ చక్రవర్తి బోల్డ్ స్టేట్‌మెంట్.. షాక్‌లో హీరోయిన్లు!
X

దిశ, వెబ్‌డెస్క్: అప్పట్లో రొమాంటిక్ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా విభిన్న పాత్రల్లో నటించి మంచి క్రేజ్ దక్కించుకున్నారు జేడీ చక్రవర్తి. గతేడాది ‘‘దహిణి ది విచ్’’ అనే చిత్రంలో ఉత్తమ సహాయ నటుడిగా నటించిన ఈ హీరో ఇప్పటికే ఆ మూవీకి 18 అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకొన్నాడు. తెలుగులోనే కాకుండా హిందీ, మలయాళం, తమిళం పలు భాషల్లో సినిమాల్లో నటించి ప్రేక్షకుల మెప్పు పొందారు. ప్రస్తుతం హాట్ స్టార్‌లో ఓ ఒరిజినల్‌లో నటిస్తున్నారు. ఇందులో ఈషా రెబ్బా కూడా నటించనున్నారు. త్వరలోనే విడుదల కానున్న నేపథ్యంలో తాజాగా ఈ జోడీ ఓంకార్ యాంకర్‌గా చేస్తున్న ‘సిక్త్స్ సెన్స్’ షోకి హాజరయ్యి.. తెగ సందడి చేశారు. షో మధ్యలో ఓంకార్ హీరోను ‘‘మీ కెరీర్‌లో ఏ హీరోయిన్‌నైనా ఎప్పుడైనా ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించారా?’’ అని ఓ క్రేజీ ప్రశ్న అడిగారు. ‘మా డాడీ మీద ఒట్టు అందరూ హీరోయిన్లకు ట్రై చేశాను’ అంటూ బదులివ్వగా.. షోలో ఒక్కసారిగా నవ్వులు పూశాయి. ప్రోమోలో ఇది హైలైట్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ ప్రోమో యూట్యూబ్‌లో తెగ ట్రెండ్ అవుతోంది.



Also Read: ప్రభాస్-మారుతి సినిమాకు టైటిల్ ఇదే..

Next Story