- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మా బంధం ఎప్పుడు కూలిపోతుందా అని చూసేవారికి ఇదే నా జవాబు.. ప్రియాంక చోప్రా సెన్సేషనల్ కామెంట్స్
గ్లోబల్ బ్యూటీప్రియాంక చోప్రా(Priyanka Chopra) , నిక్ జోనాస్(Nick Jonas) మధ్య 10 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉన్నప్పటికీ ప్రేమ పెళ్లి చేసుకున్నారు.

దిశ, సినిమా: గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా(Priyanka Chopra) , నిక్ జోనాస్(Nick Jonas) మధ్య 10 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉన్నప్పటికీ ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ పాప కూడా ఉంది. అయితే పలు కారణాల వల్ల విడాకులు తీసుకుని విడిపోతున్నారంటూ గత కొద్ది కాలంగా పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈక్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన భర్త నిక్ జోనాస్‌తో ఉన్న రిలేషన్‌షిప్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రియాంక, నిక్ జోనాస్‌ల వివాహం జరిగి ఎనిమిదేళ్లు అవుతున్నా, వారి మధ్య వయస్సు తేడా, వేర్వేరు సంస్కృతులు, మతాల కారణంగా వారి బంధం ఎక్కువ కాలం నిలవదనే ప్రచారం సోషల్ మీడియాలో తరచూ జరుగుతుంటుంది. దీనిపై ప్రియాంక స్పందిస్తూ.. ‘‘మా బంధం ఎప్పుడు కూలిపోతుందా అని చూసేవారికి ఇది నా జవాబు. మేము పెళ్లై ఎనిమిదేళ్లు దాటింది. మా పెళ్లి ఎప్పుడు పెటాకులు అవుతుందా అని ఎవరైనా ఎదురుచూస్తుంటే, అది వారి ఇష్టం.
దాని గురించి ఆలోచించడం నేను ఎప్పుడో మానేశాను. మొదట్లో ఇలాంటి మాటలు బాధ కలిగించేవి, కానీ ఇప్పుడు అవేవీ పట్టించుకోవడం లేదు’’ అని సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇక నిక్ చాలా నిజాయితీ గల వ్యక్తి అని, అదే తనను ప్రతిరోజూ ఇన్‌స్పైర్ చేస్తుందని ఆమె చెప్పింది. ‘‘మేము కలిసిన ఆరు నెలలకే పెళ్లి చేసుకున్నాం. మొదట్లో ఆయన ఇంత నిజాయితీగా ఉండటం చూసి, ఇది నటన ఏమో అని అనుకున్నాను. కానీ ఆయన స్వభావమే అది. తన పని పట్ల, తన మాటల పట్ల ఆయన ఎప్పుడూ నిబద్ధతతో ఉంటారు. అతను నిజంగా చిన్నతనంలోనే పనిచేయడం ప్రారంభించాడు. తని తల్లిదండ్రులు చాలా అద్భుతమైన, స్థిరమైన, నిష్కల్మషమైన వ్యక్తులు. నిక్ కూడా వాళ్ల పేరెంట్స్ లాగే ఉంటాడు’’ అని అత్తింటి వారిపై ప్రశంసలు కురిపించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ కావడంతో.. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు గట్టిగా ఇచ్చిపడేసిందిగా? అని చర్చించుకుంటున్నారు.






