- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘‘నేను కేవలం బొమ్మను కాదు’’.. ప్రియాంక చోప్రా ఎమోషనల్ కామెంట్స్
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) తీసుకున్న ఒక సాహసోపేత నిర్ణయం చర్చనీయాంశమైంది.

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra)భారతీయ సినిమాల్లో స్టార్ హీరోయిన్‌గా వెలుగుతున్న సమయంలోనే ఆమె తీసుకున్న ఒక సాహసోపేత నిర్ణయం ఇప్పుడు మళ్ళీ చర్చనీయాంశమైంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియాంక తన హాలీవుడ్ ప్రయాణంలోని కష్టనష్టాలను పంచుకున్నారు. ప్రియాంక మాట్లాడుతూ.. ‘‘30 ఏళ్ల వయసులో కెరీర్‌ను మళ్ళీ మొదటి నుంచి ప్రారంభించడం చాలా భయంకరమైన విషయం. అప్పటికే నేను భారతదేశంలో ఆర్థికంగా స్థిరపడ్డాను, స్టార్‌డమ్ ఉంది. కానీ వాటన్నింటినీ వదులుకుని అమెరికా వెళ్లాలని నిర్ణయించుకున్నాను’’ అని తెలిపారు. 2015లో ‘మేరీ కోమ్’, ‘బాజీరావ్ మస్తానీ’ వంటి సూపర్ హిట్ సినిమాలతో పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడే ఆమె హాలీవుడ్‌కు వెళ్లడం గమనార్హం. అక్కడ ముందుగా సింగర్‌గా అడుగుపెట్టినా, ఆ తర్వాత ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది.
గ్లోబల్ స్టార్‌గా ఎదిగి.. హాలీవుడ్‌లో తనను ఎదుర్కొన్న మూస పద్ధతులు గురించి ప్రియాంక ఆసక్తికర విషయాలు చెప్పారు. ‘‘నేను మీటింగ్స్‌కు వెళ్ళినప్పుడు 'నువ్వు ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నావు' అనేవారు. భారతీయులంటే ఒక రకమైన భావన అక్కడ ఉండేది. కానీ నేను కేవలం ఒక పాత్రకే పరిమితం కాకుండా, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందే కథల్లో భాగం కావాలని కోరుకున్నాను’’ అని ఆమె వివరించారు. విరామం లేకుండా అన్నింటిలో నటించడానికి తాను కేవలం బొమ్మను కాదని.. మనిషిని అని ఆవేదన వ్యక్తం చేసింది. ‘క్వాంటికో’ సిరీస్‌తో మొదలైన ఆమె ప్రయాణం.. బేవాచ్, ది మ్యాట్రిక్స్ 4, , తాజా భారీ సిరీస్ ‘సిటాడెల్’ వరకు సక్సెస్‌ఫుల్‌గా కొనసాగింది.
ఇక ఇప్పుడు సుమారు ఎనిమిదేళ్ల విరామం తర్వాత ప్రియాంక మళ్ళీ ఇండియన్ సినిమాలో నటించబోతున్నారు. దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి రూపొందిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’ (Varanasi) ద్వారా ఆమె రీ-ఎంట్రీ ఇస్తున్నారు. మహేష్ బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ఇండియన్ హిస్టరీ నేపథ్యంలో సాగే 'టైమ్ ట్రావెల్ అడ్వెంచర్'. 2027 ఏప్రిల్‌లో ఈ సినిమా విడుదల కానుంది. హాలీవుడ్‌లో గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన తర్వాత ప్రియాంక చేస్తున్న ఈ ఇండియన్ ప్రాజెక్టుపై భారీ అంచనాలు నెలకొన్నాయి.






