అందరి ముందు పెళ్లాన్ని అడిగినట్టు అడిగారు.. శ్రీలీల షాకింగ్ కామెంట్

by Mallepaka Hamsa |   (  Updated:2026-02-01 04:50:12  IST  )

టాలీవుడ్‌లో వరుస సినిమాలతో దూసుకెళ్తున్న సెన్సేషన్ బ్యూటీ శ్రీలీల(Sreeleela) ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీలో నటిస్తూ బిజీగా ఉంది.

అందరి ముందు పెళ్లాన్ని అడిగినట్టు అడిగారు.. శ్రీలీల షాకింగ్ కామెంట్
X

దిశ, సినిమా: టాలీవుడ్‌లో వరుస సినిమాలతో దూసుకెళ్తున్న సెన్సేషన్ బ్యూటీ శ్రీలీల(Sreeleela) ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీలో నటిస్తూ బిజీగా ఉంది. ఓ వైపు తెలుగు, తమిళ సినిమాలు చేస్తూనే మరోవైపు పబ్లిక్ ఈవెంట్స్‌లోనూ పాల్గొంటూ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. తాజాగా, పల్నాడు జిల్లా నరసరావుపేటలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహించిన ‘జూబిలేషన్’ (Jubilation)ఫెస్ట్‌కు శ్రీలీల ముఖ్య అతిథిగా హాజరయ్యింది. స్టేజ్‌పైకి అడుగుపెట్టినప్పటి నుంచే ఆమె ఎనర్జీతో కాలేజ్ మొత్తం ఉత్సాహంతో నిండిపోయింది. విద్యార్థులతో ముచ్చటిస్తూ, తన చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకున్న శ్రీలీల.. చిన్నప్పుడు నరసరావుపేటకు వచ్చిన విషయాన్ని గుర్తు చేసుకుంది. అలాగే ఒంగోలు తన అమ్మమ్మ, తాతయ్యల ఊరని చెప్పగానే స్టూడెంట్స్ అరుపులతో వేడుకను హోరేత్తించారు. చదువు ఎంత ముఖ్యమో, జీవితంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వెనక్కి తగ్గకుండా ముందుకు సాగాలని ఆమె చెప్పిన మాటలు అక్కడున్న యువతను బాగా ప్రభావితం చేశాయి.

స్పీచ్ మధ్యలోనే, “మిమ్మల్ని చూసి అరిచి అరిచి నా గొంతే పోయింది” అంటూ నవ్వుతూ చేసిన కామెంట్ స్టేజ్‌ను మరింత హుషారుగా మార్చింది. అయితే ఆ సమయంలో కింద నుంచి కొందరు విద్యార్థులు “డాన్స్… డాన్స్ చేయాలి” అంటూ గట్టిగా అరవడంతో వాతావరణం ఒక్కసారిగా మారింది. కానీ శ్రీలీల ఏమాత్రం అసహనం చూపకుండా, చిరునవ్వుతోనే స్పందించింది ‘‘నిజంగా పెళ్లాన్ని అడిగినట్టు అడిగారు.. సరే డ్యాన్స్ చేద్దాం, రండి” అంటూ సరదాగా సమాధానమిచ్చింది. ఆమె మాటలకు స్టూడెంట్స్ ఫుల్ జోష్‌లోకి వచ్చారు. ఆ తర్వాత విద్యార్థులతో కలిసి శ్రీలీల వేసిన స్టెప్పులు ఫెస్ట్‌కే హైలైట్‌గా నిలిచాయి. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు “యూత్ క్రష్ అంటే ఇదే” అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా.. శ్రీలీల తమిళ స్టార్ హీరో ధనుష్ సరసన కూడా అవకాశం దక్కించుకుంది. ఆయన కెరీర్‌లో ప్రతిష్ఠాత్మకంగా రాబోతున్న 55వ చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌గా చేస్తోంది. ఈ సినిమాకు రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్నారు.

Read More..

Niharika: నా లోపల తెలియని బరువును మోస్తున్నా.. నిహారిక ఎమోషనల్ పోస్ట్‌కు కారణం అదేనా?

Next Story