Niharika: నా లోపల తెలియని బరువును మోస్తున్నా.. నిహారిక ఎమోషనల్ పోస్ట్‌కు కారణం అదేనా?

by Mallepaka Hamsa |   (  Updated:2026-02-01 04:30:56  IST  )

మెగా డాటర్ నిహారిక కొణిదెల(Niharika Konidela) నిర్మాతగా సత్తా చాటుతోంది.

Niharika: నా లోపల తెలియని బరువును మోస్తున్నా.. నిహారిక ఎమోషనల్ పోస్ట్‌కు కారణం అదేనా?
X

దిశ, సినిమా: మెగా డాటర్ నిహారిక కొణిదెల(Niharika Konidela) నిర్మాతగా సత్తా చాటుతోంది. కెరీర్‌లో ఎన్నో విమర్శలు, ట్రోల్స్ ఎదురైనా వెనకడుగు వేయకుండా తనదైన దారిలో ముందుకు సాగుతున్న నిహారిక, నిర్మాతగా మాత్రం ఫుల్ కాన్ఫిడెన్స్‌తో అడుగులు వేస్తోంది. ‘కమిటీ కుర్రోళ్లు’ సినిమాతో నిహారికకు నిర్మాతగా భారీ గుర్తింపు లభించింది. ఈమూవీకి గద్దర్ అవార్డు రావడంతో నిహారిక పేరు ఇండస్ట్రీ వర్గాల్లో మరింతగా వినిపిస్తోంది. చిన్న సినిమాలకూ క్వాలిటీ కంటెంట్ ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారనే విషయాన్ని నిహారిక మరోసారి నిరూపించింది. ఈ విజయం ఆమెకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిందని చెప్పాలి.

ఈ సక్సెస్‌తో ఆగకుండా వెంటనే రెండో ప్రాజెక్ట్‌ను లైన్‌లో పెట్టింది నిహారిక. సంతోష్ శోభన్ హీరోగా తెరకెక్కుతున్న ‘రాకాస’ సినిమాను పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై ఉమేష్ కుమార్ బన్సాల్‌తో కలిసి నిర్మిస్తోంది. మానస శర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, నయన్ సారిక హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతోంది. కొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే ఇండస్ట్రీలో మంచి బజ్ ఏర్పడింది. ఇదిలా ఉంటే.. తాజాగా, నిహారిక ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది.

తనకు ఎంతో బాధని మోస్తున్నట్లు తెలుపుతూ.. ‘‘నా మనసులో మాటలతో చెప్పలేని తెలియని బరువును మోస్తున్నాను. అది ఒత్తిడో లేక ఇంకేదైనా నాకు కూడా స్పష్టంగా తెలియదు. ఆ భావాన్ని వివరించడానికి సరైన పదాలే దొరకడం లేదు. అయినా ఆ బరువుకు లొంగిపోకుండా నేను ముందుకు సాగుతున్నాను. కొన్ని రోజులు జిమ్‌లో చెమటోడ్చుతూ లోపలి భారాన్ని తక్కువ చేసుకునే ప్రయత్నం చేస్తాను. మరికొన్ని రోజులు నడక, యోగా ద్వారా మనసుకు ప్రశాంతతను వెతుక్కుంటాను. బయటివారికి పెద్దగా మార్పు కనిపించకపోయినా నా లోపల మాత్రం చాలా మార్పులు జరుగుతున్నాయని స్పష్టంగా అనిపిస్తోంది’’ అనే క్యాప్షన్ జత చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ఒంటరిగా ఉండలేక పెళ్లి గురించే బాధపడుతుందా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

Read More..

ట్విన్స్‌కు జన్మనిచ్చిన ఉపాసన.. సుష్మిత కొణిదెల ఎమోషనల్ ట్వీట్

Next Story