- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ట్విన్స్‌కు జన్మనిచ్చిన ఉపాసన.. సుష్మిత కొణిదెల ఎమోషనల్ ట్వీట్
మెగా కపుల్ రామ్ చరణ్(Ram Charan)-ఉపాసన(Upasana) తాజాగా తల్లిదండ్రులుగా ప్రమోషన్స్ పొందారు.

దిశ, వెబ్‌డెస్క్: మెగా కపుల్ రామ్ చరణ్(Ram Charan)-ఉపాసన(Upasana) తాజాగా తల్లిదండ్రులుగా ప్రమోషన్స్ పొందారు. మెగా కోడలు ఉపాసన తాజాగా కవల పిల్లలకు జన్మనిచ్చింది. జనవరి 31 శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో ఉపాసన ఓ బాబు, ఓ పాపకు జన్మనిచ్చినట్లు కుటుంబ వర్గాలు తెలియజేశాయి. ఈ క్రమంలో రామ్ చరణ్ సిస్టర్ సుస్మిత కొణిదెల(Sushmitha Konidela) ఓ ఎమోషనల్ ట్వీట్ చేసింది. ‘2026 మా మొత్తం కుటుంబానికి నిజంగా ఒక ఆశీర్వాదకరమైన ప్రారంభం.. మరోసారి అత్తగా మారడం అండ్ ఈసారి, రెట్టింపు ఆనందం మరియు ప్రేమతో నిజంగా ప్రత్యేకమైనది.
ధన్యవాదాలు, నా ప్రియమైన చరణ్ అండ్ ఉప్సి. పెద్ద అక్కగా మారినందుకు నా చిన్ని కారాకు చాలా ప్రేమ’ అని రాసుకొచ్చింది. కాగా ఇప్పటికే రామ్ చరణ్ – ఉపాసన దంపతులకు 2023లో జన్మించిన కుమార్తె క్లీంకార ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు కవల పిల్లలు పుట్టడంతో మెగా కుటుంబం మరింత పెద్దదైంది. ముఖ్యంగా వారసుడు పుట్టినందుకు మెగా ఫ్యామిలీ చాలా సంతోషంగా ఉన్నారని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది.
Read More..
Niharika: నా లోపల తెలియని బరువును మోస్తున్నా.. నిహారిక ఎమోషనల్ పోస్ట్‌కు కారణం అదేనా?






