రవితేజ పక్కన చాన్స్ అని నమ్మించి నన్ను మోసం చేశారు.. గీతా సింగ్ షాకింగ్ కామెంట్స్

by Mallepaka Hamsa |   (  Updated:2026-04-07 12:30:19  IST  )

అనిల్ రావిపూడి గారి కోడైరెక్టర్లు నన్ను కలిసి, మూవీలో ఒక క్రేజీ రోల్ ఉందని చెప్పారు. రవితేజ పక్కన ఉండే ఇంపార్టెంట్ క్యారెక్టర్ అని చెప్పడంతో చాలా ఎగ్జైట్ అయ్యాను.

రవితేజ పక్కన చాన్స్ అని నమ్మించి నన్ను మోసం చేశారు.. గీతా సింగ్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి వరుస హిట్లతో దూసుకుపోతుంటే, ఆయన టీమ్ చేసిన ఒక పని ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ప్రముఖ కమెడియన్ గీతా సింగ్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో తనకు జరిగిన అవమానాన్ని బయటపెట్టి అందరినీ షాక్‌కు గురిచేశారు. మాస్ మహారాజా రవితేజ నటించిన ‘రాజా ది గ్రేట్’ సినిమాలో తనకు ఆఫర్ ఇచ్చి, చివరి నిమిషంలో హ్యాండిచ్చారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గీతా సింగ్ మాట్లాడుతూ.. "అనిల్ రావిపూడి గారి కోడైరెక్టర్లు నన్ను కలిసి, మూవీలో ఒక క్రేజీ రోల్ ఉందని చెప్పారు. రవితేజ పక్కన ఉండే ఇంపార్టెంట్ క్యారెక్టర్ అని చెప్పడంతో చాలా ఎగ్జైట్ అయ్యాను. దాని కోసం ఏకంగా నెల రోజుల పాటు డేట్స్ అడ్జస్ట్ చేశాను. ఆ సినిమా కోసం వేరే ఆఫర్లను కూడా వదులుకున్నాను. కానీ తీరా షూటింగ్ టైమ్ దగ్గరపడ్డాక టీమ్ నుండి ఎలాంటి ఉలుకూ పలుకూ లేదు" అని చెప్పారు. కోడైరెక్టర్ల నెంబర్లు సంపాదించి ఎన్నిసార్లు కాల్ చేసినా ఎవరూ లిఫ్ట్ చేయలేదని ఆమె చెప్పుకొచ్చారు.

"ఏదో పొరపాటు జరిగిందేమో అని సరిపెట్టుకున్నాను. కానీ సినిమా రిలీజ్ అయ్యాక థియేటర్‌కు వెళ్లి చూస్తే నా బుర్ర తిరిగిపోయింది. నాకు చెప్పిన అదే పాత్రలో మరో నటిని చూసి చాలా బాధపడ్డాను. కనీసం నాకు సమాచారం కూడా ఇవ్వకుండా వేరే వాళ్లతో ఆ సీన్లు చేయించడం ఏమాత్రం పద్ధతి కాదు" అని గీతా సింగ్ తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఒక నటిగా తనకు రావాల్సిన గౌరవం ఇవ్వలేదని, తన సమయాన్ని వృథా చేశారని ఆమె వాపోయారు. పెద్ద దర్శకుల టీమ్‌లో ఇలాంటి బాధ్యతారాహిత్యం ఉంటుందని ఊహించలేదని ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు ఫిల్మ్ నగర్‌లో చర్చనీయాంశంగా మారాయి. గీతా సింగ్ వంటి సీనియర్ ఆర్టిస్ట్‌కు ఇలాంటి చేదు అనుభవం ఎదురవ్వడంపై నెటిజన్లు కూడా రకరకాలుగా స్పందిస్తున్నారు.

Anil Ravipudi: నెక్స్ట్ మూవీ పనుల కోసం అక్కడికి వెళ్లిన స్టార్ డైరెక్టర్

Next Story