- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నువ్వు లేని లోటు ఎప్పటికీ తీరదు.. అషు రెడ్డి హార్ట్ బ్రేకింగ్ పోస్ట్
నువ్వు లేని లోటు ఎప్పటికీ తీరదు. నా ప్రాణ స్నేహితుడు, నా ఫ్యామిలీ మెంబర్, నా ఆత్మీయుడు.. నా ఎమర్జెన్సీ కాంటాక్ట్ అయిన నువ్వు ఇప్పుడు శివయ్య చెంతకు చేరిపోయావు.

దిశ, సినిమా: బుల్లితెర నటి, సోషల్ మీడియా సెన్సేషన్ అషు రెడ్డి ప్రస్తుతం తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఒకవైపు వ్యక్తిగత వివాదాలు, కోర్టు కేసులతో సతమతమవుతున్న ఆమెకు, తన ప్రాణ స్నేహితుడు, నటుడు భరత్ కాంత్ రోడ్డు ప్రమాదంలో మరణించడం కోలుకోలేని దెబ్బ. ఈ విషాద వార్తను తెలుపుతూ అషు రెడ్డి సోషల్ మీడియాలో పెట్టిన ఎమోషనల్ పోస్ట్ ప్రస్తుతం అందరినీ కన్నీరు పెట్టిస్తోంది. నెల్లూరు నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా మే 11న తెల్లవారుజామున ఈ ఘోర ప్రమాదంలో భరత్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని బొంగుళూరు-తుక్కుగూడ మార్గంలో, ఎగ్జిట్-12 సమీపంలో భరత్ ప్రయాణిస్తున్న కారు నియంత్రణ కోల్పోయి ముందు వెళ్తున్న కంటైనర్ లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భరత్ కాంత్‌తో పాటు సాయిత్రిలోక్ అనే వ్యక్తి అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. భరత్‌తో కలిసి దిగిన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ అషు రెడ్డి ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. "నువ్వు లేని లోటు ఎప్పటికీ తీరదు. నా ప్రాణ స్నేహితుడు, నా ఫ్యామిలీ మెంబర్, నా ఆత్మీయుడు.. నా ఎమర్జెన్సీ కాంటాక్ట్ అయిన నువ్వు ఇప్పుడు శివయ్య చెంతకు చేరిపోయావు.
నీకు ఎప్పటికీ చేరని ఈ సందేశాన్ని ఇలా పోస్ట్ చేయాల్సి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. నిన్ను మళ్ళీ కలిసే వరకు నీ చిరునవ్వు నా జ్ఞాపకాల్లో అలాగే ఉంటుంది. మిస్ యూ భరత్" అంటూ తన ఆవేదనను వ్యక్తం చేశారు. షార్ట్ ఫిలిమ్స్ ద్వారా నటుడిగా కెరీర్ ప్రారంభించిన భరత్ కాంత్, 2024లో విడుదలైన ‘టెనెంట్’ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. కేవలం నటుడిగానే కాకుండా సినిమాటోగ్రాఫర్‌గా కూడా పని చేస్తూ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఎంతో భవిష్యత్తు ఉన్న యువ నటుడు ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడం టాలీవుడ్‌లో విషాదాన్ని నింపింది. మరోవైపు అషు రెడ్డి ఇప్పటికే 9.35 కోట్ల రూపాయల మోసం కేసులో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లండన్‌కు చెందిన ధర్మేంద్ర అనే వ్యక్తి పెళ్లి పేరుతో తనను మోసం చేసిందని పెట్టిన కేసుపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఇలాంటి క్లిష్ట సమయంలో ప్రాణ స్నేహితుడిని కోల్పోవడం ఆమెను మరింత కృంగదీసింది.






