- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేను మోడీకే సపోర్ట్ చేస్తా రేపిస్టులకు కాదు.. నన్ను దూషించి మీ ఎనర్జీ వృధా చేసుకోవద్దు.. హాట్ టాపిక్‌గా మారిన రష్మీ పోస్ట్
నేను బీజేపీకి, నరేంద్ర మోదీ గారికి మద్దతు ఇస్తాను. కానీ, లైంగిక వేధింపులకు లేదా రేపిస్టులకు మాత్రం ఎప్పటికీ సపోర్ట్ చేయను

దిశ, సినిమా: జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ బుల్లితెరపై తిరుగులేని పాపులారిటీని సొంతం చేసుకుంది. కేవలం గ్లామర్ పరంగానే కాకుండా, సామాజిక అంశాలపై స్పందించే తీరులోనూ ఆమె ఎప్పుడూ ముందే ఉంటుంది. తాజాగా ఆమె సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ నెట్టింట పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. తన రాజకీయ మద్దతుతో పాటు, తనపై వస్తున్న విమర్శలకు ఆమె ఈ పోస్ట్ ద్వారా గట్టి సమాధానం ఇచ్చారు.రష్మీ తన పోస్ట్‌లో చాలా స్పష్టంగా తన అభిప్రాయాలను పంచుకున్నారు. “నేను బీజేపీకి, నరేంద్ర మోదీ గారికి మద్దతు ఇస్తాను. కానీ, లైంగిక వేధింపులకు లేదా రేపిస్టులకు మాత్రం ఎప్పటికీ సపోర్ట్ చేయను” అని ఆమె కుండబద్దలు కొట్టారు. తనను బూతులతో దూషించే వారికి తాను ఎప్పుడూ రిప్లై ఇవ్వనని, అలాంటి వారిని అసలు పట్టించుకోనని ఆమె స్పష్టం చేశారు. చాలామంది సెలబ్రిటీలను ట్యాగ్ చేస్తూ ప్రతి సమస్యపై స్పందించాలని కోరుతుంటారని, అయితే కేవలం తాను పోస్ట్ చేయడం వల్ల ఏ మార్పు రాదని ఆమె అభిప్రాయపడ్డారు.
ముఖ్యంగా సామాజిక సమస్యలపై తన పరిధిని వివరిస్తూ.. “నేను కేవలం మనుషుల సమస్యల పట్ల సానుభూతి మాత్రమే చూపగలను. వాటిపై పోరాడే శక్తి నాకు లేదు. కానీ, గొంతులేని మూగజీవాల కోసం నేను నిరంతరం అండగా ఉంటాను. మానవ సంబంధిత సమస్యలను ప్రశ్నించడానికి సమాజంలో ఎంతోమంది ఉన్నారు. అందుకే నేను జంతువుల సంరక్షణకే నా ప్రాధాన్యత ఇస్తాను” అని రష్మీ పేర్కొన్నారు. తనను అనవసరంగా దూషిస్తూ మీ ఎనర్జీని వృధా చేయవద్దని, అదే ఎనర్జీని సరైన అధికారులను ట్యాగ్ చేసి న్యాయం కోరడానికి ఉపయోగించాలని ఆమె నెటిజన్లకు హితవు పలికారు. సెలబ్రిటీలకు ట్యాగ్ చేయడం ఒక ఫ్యాషన్‌గా మారిందని, కానీ దానివల్ల ప్రయోజనం ఉండదని ఆమె అభిప్రాయపడ్డారు. రష్మీ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. కొందరు ఆమె ముక్కుసూటితనాన్ని మెచ్చుకుంటుంటే, మరికొందరు మాత్రం ఆమె వైఖరిపై భిన్నంగా స్పందిస్తున్నారు. ఏది ఏమైనా, తన రాజకీయ, వ్యక్తిగత అభిప్రాయాలను ఇంత బహిరంగంగా వెల్లడించడం రష్మీ ధైర్యానికి నిదర్శనమని చెప్పాలి.






