- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హాట్ టాపిక్‌గా మారిన ‘టాక్సిక్’ బ్యూటీ డేటింగ్.. పదేళ్ల ఏజ్ గ్యాప్ ఉన్నా తగ్గేదేలే!
హ్యాండ్సమ్ హంక్ ఆదిత్య రాయ్ కపూర్, అందాల నటి తారా సుతారియా ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

దిశ, సినిమా: బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు సరికొత్త హాట్ కపుల్ గురించి జోరుగా చర్చ సాగుతోంది. హ్యాండ్సమ్ హంక్ ఆదిత్య రాయ్ కపూర్, అందాల నటి తారా సుతారియా ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ కలిసి నటిస్తున్న అప్‌కమింగ్ సినిమా వర్క్‌షాప్స్ సమయంలో వీరి మధ్య పరిచయం ఏర్పడిందని, అది కాస్తా ఇప్పుడు గాఢమైన ప్రేమగా మారిందని ఇండస్ట్రీ వర్గాల టాక్. ఆదిత్య, తారాల డేటింగ్ వార్తలు బయటకు రాగానే నెటిజన్లు వారి మధ్య ఉన్న వయస్సు వ్యత్యాసంపై ఆరా తీయడం మొదలుపెట్టారు. ఆదిత్య రాయ్ కపూర్ 1985 నవంబర్ 16న జన్మించగా, ప్రస్తుతం ఆయన వయస్సు 40 ఏళ్లు. ఇక తారా సుతారియా 1995 నవంబర్ 19న జన్మించగా, ఆమె వయస్సు 30 ఏళ్లు. వీరిద్దరి మధ్య దాదాపు పదేళ్ల గ్యాప్ ఉందని తెలుస్తోంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, వీరి పుట్టినరోజులు కేవలం మూడు రోజుల వ్యవధిలోనే ఉండటం విశేషం. ప్రేమ ముందు వయస్సు కేవలం అంకె మాత్రమే అని వీరిద్దరూ నిరూపిస్తున్నారని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
ఆదిత్య, తారా ఇద్దరూ తమ వ్యక్తిగత విషయాలను చాలా గోప్యంగా ఉంచుతారు. అందుకే వీరి ప్రేమ వ్యవహారం ఇన్నాళ్లూ బయటకు రాలేదు. గతంలో తారా సుతారియా, వీర్ పహారియాతో డేటింగ్ చేయగా.. ఆదిత్య పేరు అనన్య పాండేతో వినిపించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుత ప్రేమ వార్తలపై వీరిద్దరూ ఇంకా అధికారికంగా స్పందించలేదు.కెరీర్ పరంగా కూడా వీరిద్దరూ చాలా బిజీగా ఉన్నారు. ఆదిత్య రాయ్ కపూర్ ప్రస్తుతం రాజ్ అండ్ డీకే క్రియేట్ చేస్తున్న ‘రక్త బ్రహ్మాండం: ది బ్లడీ కింగ్‌డమ్’ అనే సిరీస్‌లో నటిస్తున్నారు. ఇందులో సమంత రూత్ ప్రభు కథానాయికగా నటిస్తోంది. ఇక తారా సుతారియా తన తొలి పాన్-ఇండియా చిత్రం ‘టాక్సిక్’ తో పలకరించబోతోంది. కన్నడ సూపర్ స్టార్ యష్ హీరోగా గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో తార ‘రెబెక్కా’ అనే కీలక పాత్ర పోషిస్తోంది. వీటితో పాటు, ఈ నెలలో జరగనున్న ప్రతిష్టాత్మకమైన కాన్స్ 2026 రెడ్ కార్పెట్‌పై తారా సుతారియా మెరవబోతోంది. భారతీయ ప్రతినిధిగా గ్లోబల్ స్టేజ్ పై ఆమె అడుగుపెడుతుండటం విశేషం.






