బలగం వేణు ‘ఎల్లమ్మ’లో బిగ్ ట్విస్ట్.. దేవిశ్రీ సరసన హీరోయిన్‌గా క్రేజీ బ్యూటీ ఫైనల్!

by Mallepaka Hamsa |   (  Updated:2026-05-06 08:50:20  IST  )

బలగం వేణు  ‘ఎల్లమ్మ’లో బిగ్ ట్విస్ట్.. దేవిశ్రీ సరసన హీరోయిన్‌గా క్రేజీ బ్యూటీ ఫైనల్!
X

దిశ, సినిమా: జబర్దస్త్ కమెడియన్‌గా కెరీర్ ప్రారంభించి, తన మొదటి సినిమా ‘బలగం’తో దర్శకుడిగా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న వేణు యెల్దండి ఇప్పుడు తన రెండో ప్రాజెక్టుపై ఫుల్ ఫోకస్ పెట్టారు. తెలంగాణ మట్టి వాసనతో కూడిన ఎమోషనల్ కథలను తెరకెక్కించడంలో దిట్ట అనిపించుకున్న వేణు, తన తదుపరి చిత్రం ‘ఎల్లమ్మ’ కోసం ఒక భారీ స్కెచ్ వేశారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్‌డేట్ ఇప్పుడు ఫిల్మ్ నగర్‌లో హాట్ టాపిక్‌గా మారుతోంది. ఈ సినిమాలో అందరినీ ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే.. టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ఇందులో హీరోగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ సినిమాపై అంచనాలను ఆకాశానికి తీసుకెళ్లాయి. అందులోనూ డిఎస్పీ ఇందులో ఒక పవర్‌ఫుల్ పర్శి పాత్రలో కనిపించబోతున్నాడు. వేణు మార్క్ ఎమోషన్స్, డిఎస్పీ ఎనర్జీ తోడైతే సినిమా రేంజ్ మరోలా ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే దానిపై గత కొద్ది రోజులుగా పెద్ద చర్చే నడిచింది.

మొదట సాయి పల్లవి, ఆ తర్వాత కీర్తి సురేష్, శ్రీలీల, భాగ్యశ్రీ బోర్సే వంటి స్టార్ హీరోయిన్ల పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. కానీ, తాజా సమాచారం ప్రకారం.. మృణాల్ ఠాకూర్ ఈ క్రేజీ ఆఫర్‌ను దక్కించుకున్నట్లు తెలుస్తోంది. వేణు చెప్పిన కథ తన పాత్రలోని డెప్త్ నచ్చడంతో మృణాల్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. దాదాపు మృణాల్ ఫైనల్ అయిపోయినట్లు సమాచారం. సీతారామం, హాయ్ నాన్న వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న మృణాల్.. వేణు దర్శకత్వంలో ఎలా కనిపిస్తుందో చూడాలని అందరూ ఆసక్తిగా ఉన్నారు. మృణాల్ ఎంపికపై సోషల్ మీడియాలో నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఈ కాంబినేషన్ చాలా ఫ్రెష్‌గా ఉంటుందని అంటుంటే, మరికొందరు మాత్రం ఈ జోడీ సెట్ అవుతుందా? అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా, తన మొదటి సినిమాతోనే సంచలనం సృష్టించిన వేణు, ఈసారి కూడా ఏదో ఒక మ్యాజిక్ చేస్తాడనే నమ్మకంతో మేకర్స్ ఉన్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.

హాట్ టాపిక్‌గా మారిన ‘టాక్సిక్’ బ్యూటీ డేటింగ్.. పదేళ్ల ఏజ్ గ్యాప్ ఉన్నా తగ్గేదేలే!

Next Story