రేసుగుర్రం నటుడితో పీకల్లోతు ప్రేమలో మునిగిన స్టార్ హీరోయిన్!

by Anjali |
రేసుగుర్రం నటుడితో పీకల్లోతు ప్రేమలో మునిగిన స్టార్ హీరోయిన్!
X

దిశ, వెబ్‌డెస్క్: పదిహేనేళ్ల వయస్సులోనే హీరోయిన్‌గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది అచ్చతెలుగు అమ్మాయి ‘రంభ’. ఆల్‌మోస్ట్ సీనియర్ హీరోలందరితో జతకట్టిన ఈ భామ రెండు దశాబ్దాల క్రితం స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. ఇకపోతే గతంలో రంభ ‘రేసుగుర్రం’ సినిమా విలన్, భోజ్‌పురి హీరో రవి కిషన్‌తో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరు పలు సినిమాల్లో కలిసి నటించడంతో.. ఆ సమయంలో ఇద్దరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారిందట.

ఈ హీరోయిన్ క్యారెక్టర్ నచ్చడంతో.. రవికిషన్, రంభ ఇద్దరు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారట. కానీ రవికిషన్‌కు అప్పటికే పెళ్లైంది. ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నాడు. ఇక ఈ విషయం రవికిషన్ అన్నయ్యకు తెలియడంతో రంభకు దూరంగా ఉండేలా.. ఈ హీరోకు బ్రెయిన్ వాష్ చేసి.. భోజ్‌పురిలో ఆమెకు అవకాశాకలు రాకుండా అక్కడ నుంచి పర్మినెంట్‌గా వెళ్లిపోయేలా చేశాడని టాక్.

ఈ వార్త ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ.. ఈ కారణంగా వీరి ప్రేమ బంధం పెళ్లివరకు పోకుండా ఆగిపోయిందని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. కాగా, హీరోయిన్‌గా కెరీర్ క్లోజ్ అయిపోతున్న సమయంలో రంభ.. కెనడాకు చెందిన వ్యాపారవేత్త ఇంద్రకుమార్‌ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రంభకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు.

Read More..

నిర్మాతతో‌ లవ్‌లో పడ్డ త్రిష.. త్వరలో పెళ్లి పీటలెక్కనుందట

Next Story