- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మెగాస్టార్-బాబీ మూవీలో ఆ స్టార్ యాక్టర్.. డైరెక్టర్ ప్లాన్ మామూలుగా లేదుగా..
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) రీసెంట్‌గా ‘మన శంకర వరప్రసాద్ గారు’(Mana Shankara Varaprasad Garu) చిత్రంతో బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) రీసెంట్‌గా ‘మన శంకర వరప్రసాద్ గారు’(Mana Shankara Varaprasad Garu) చిత్రంతో బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇక దీనిని దర్శకుడు అనిల్ రావిపూడి(Anil Ravipudi) తన మార్క్ ఎంటర్‌టైన్మెంట్‌తో తెరకెక్కించగా, చిరంజీవి సరసన నయనతార(Nayanathara) జంటగా నటించారు. విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) కీలక పాత్రలో కనిపించడం సినిమాకు మరింత బలం చేకూర్చింది. నిర్మాణ పరంగా షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సాహు గారపాటి(Sahu Garapati), సుస్మిత కొణిదెల(Sushmitha Konidela) ఈ సినిమాను గ్రాండ్‌గా నిర్మించారు.
ఇక చిరు ప్రస్తుతం విశ్వంభర మూవీతో పాటు బాబీ(Bobby Kolli) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ‘మెగా 158’ (Mega 158) వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును కేవీఎన్(KVN Productions) ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కె. నారాయణ(K. Narayana) నిర్మిస్తున్నారు. ఇక ఇందులో స్టార్ హీరోయిన్ ప్రియమణి(Priyamani) కథానాయికగా యాక్ట్ చేస్తుంటే మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్(Mohanlal) ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడట.
అంతేకాకుండా ఇందులో చిరంజీవికి డాటర్‌గా ‘దురంధర్’(Durandhar) మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన సారా అర్జున్(Sara Arjun) నటించబోతోంది. ఈ క్రమంలో ఈ చిత్రంలో మరో స్టార్ యాక్ట్ చేస్తున్నట్లు ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. తన విలక్షణ నటనతో ఆడియన్స్‌ను మెస్మరైజ్ చేసిన అనురాగ్ కశ్యప్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే షూటింగ్‌లో జాయిన్ కానున్నట్లు సమాచారం. దీనిపై అఫీషియల్ అనౌన్స్ రాబోతున్నది.






