- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యాక్టింగ్ చేసే చాన్స్ వస్తే ఆ రోల్ చేస్తా.. అనిల్ రావిపూడి షాకింగ్ కామెంట్స్
టాలీవుడ్‌లో ప్రస్తుతం హిట్ డైరెక్టర్ అంటే టక్కున గుర్తొచ్చే పేరు అనిల్ రావిపూడి(Anil Ravipudi).

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్‌లో ప్రస్తుతం హిట్ డైరెక్టర్ అంటే టక్కున గుర్తొచ్చే పేరు అనిల్ రావిపూడి(Anil Ravipudi). ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ డైరెక్టర్ పేరు తెలుగు ఇండస్ట్రీలో మార్మోగిపోతోంది. వరుస విజయాలతో టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. రీసెంట్‌గా ఆయన తెరకెక్కించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’(Mana Shankara vara prasad garu) సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 1న విడుదలై బాక్సాఫీస్ వద్ద అద్భుత విజయాన్ని సాధించింది. ఇప్పటి వరకు రూ.375 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి నాలుగు వందల కోట్లకు చేరువలో ఉంది.
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) హీరోగా నటించిన ఈ మూవీలో నయనతార(Nayanatara) హీరోయిన్‌గా కనిపించింది. ఇక టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ గెస్ట్ రోల్‌లో కనిపించి అలరించారు. ఇక ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్ పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మించారు. ప్రస్తుతం ఆయన విక్టరీ వెంకటేష్ (Venkatesh)తో సినిమా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్న అనిల్.. ఈ సినిమాలో మలయాళ హీరో ఫహాద్ ఫాజిల్ (Fahadh Faasil) నటిస్తోన్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అతన్ని మీకు సినిమాల్లో నటించే అవకాశం వస్తే.. హీరోగా చేస్తారా విలన్‌గా చేస్తారా అని యాంకర్ అడుగగా.. దానికి అతను స్పందిస్తూ.. ‘విలన్‌గా చేస్తా.. విలన్స్‌లో నా ఫేవరేట్ విలన్ రఘువరన్.. నా సినిమాల్లోని పంచ్ డైలాగ్స్‌లో నేను ఎక్కువగా వాడేది నాకు ఊతపదంలా అలవాటైన పంచ్ డైలాగ్ అంతేగా అంతేగా.. దీన్నే ఎక్కువగా వాడుతాను’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.






