Superstarపై అభిమానం.. ఆఫీస్‌లో లీవ్ ఇవ్వలేదని ‘Jailer’ సినిమా చూసేందుకు ఏం చేశాడంటే?

by Disha Web Desk 6 |
Superstarపై అభిమానం.. ఆఫీస్‌లో లీవ్ ఇవ్వలేదని ‘Jailer’ సినిమా చూసేందుకు ఏం చేశాడంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ హీరోల సినిమాలు విడుదల అవుతున్నాయంటే థియేటర్స్ ముందు ఫ్యాన్స్ చేసే రచ్చ అంత ఇంత కాదు. తమ అభిమాన హీరో సినిమాను ఎలాగైనా ఫస్ట్ షో చూసి ఎంజాయ్ చేయాలని అనుకుంటారు. కానీ, ఒక్కోసారి ఏదో కారణం వల్ల మూవీ చూడలేని సమయంలో తమ అభిమాన హీరో కోపం ఎంత వరకైనా ఏం చేయడానికైనా వెనకాడరు. అయితే నేడు సూపర్ స్టార్ రజినీ కాంత్ ‘జైలర్’ గ్రాండ్‌గా థియేటర్స్ విడుదలైన విషయం తెలిసిందే. ఇందులో తమన్నా హీరోయిన్‌గా నటించగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించారు. తాజాగా, ఓ వ్యక్తి ఈ సినిమాను చూసేందుకు ఏం చేశాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఓ వ్యక్తికి ‘జైలర్’ మూవీ చూసేందుకు ఆఫీస్‌లో లీవ్ మంజూర్ చేయలేదు. దీంతో అతను ఎలా అయినా చూడాలనుకుని ఏకంగా థియేటర్‌కే లాప్‌టాప్‌ను తీసుకెళ్లి అందులో వర్క్ చేస్తూ జైలర్ చూశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది.

Also Read: USAలో Rajinikanth ‘Jailer’ రికార్డ్ కలెక్షన్స్!



Next Story

Most Viewed