- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మ్యూజికల్ జర్నీ షురూ.. ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్
‘శ్రీనివాస మంగాపురం’ మ్యూజికల్ జర్నీని ప్రారంభిస్తూ.. ఈ సినిమాలోని మొదటి పాట ‘అలేల్లే అలేల్లే’ను విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు.

దిశ, సినిమా: ఆర్‌ఎక్స్ 100, మంగళవారం’ వంటి విభిన్నమైన చిత్రాలతోబ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న దర్శకుడు అజయ్ భూపతి ‘శ్రీనివాస మంగాపురం’ అనే క్రేజీ ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ద్వారా ఘట్టమనేని వారసుడు, సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా వెండితెరకు పరిచయమవుతుండటం విశేషం. ఇందులో హీరోయిన్‌గా బాలీవుడ్ స్టార్ నటి రవీనా టాండన్ కూతురు రాషా థడాని నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన పోస్టర్లు, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి చిత్రబృందం ఒక క్రేజీ అప్‌డేట్ ఇచ్చింది. ‘శ్రీనివాస మంగాపురం’ మ్యూజికల్ జర్నీని ప్రారంభిస్తూ.. ఈ సినిమాలోని మొదటి పాట ‘అలేల్లే అలేల్లే’ను విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ పాటను ఏప్రిల్ 29న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.






