‘పెద్ది’ కీలక అప్డేట్ ఇచ్చిన మూవీ మేకర్స్.. ఏకంగా పీఎం ఆఫీసులో గ్లోబల్ స్టార్..

by Mallepaka Hamsa |   (  Updated:2025-12-26 07:11:45  IST  )

మెగా అభిమానులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) ‘పెద్ది’ (peddi)షూట్‌లో ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

‘పెద్ది’ కీలక అప్డేట్ ఇచ్చిన మూవీ మేకర్స్.. ఏకంగా పీఎం ఆఫీసులో గ్లోబల్ స్టార్..
X

దిశ, సినిమా: మెగా అభిమానులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) ‘పెద్ది’ (peddi)షూట్‌లో ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. బుచ్చిబాబు సనా (Buchi Babu Sana)దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. భారీ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ప్రతిష్ఠాత్యకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ (Janhvi Kapoor)హీరోయిన్‌గా కనిపించనుంది. ఇందులో శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ ప్రధాన పాత్రలో కనిపించనుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఇందులో విడుదలైన పోస్టర్స్, టీజర్, చికిరి చికిరి సాంగ్ భారీ వ్యూస్ రాబట్టి యూట్యూబ్‌ను షేక్ చేసింది. షూట్ జరుపుకుంటున్న ఈ సినిమా రామ్ చరణ్ బర్త్ డే కానుకగా.. మార్చి 27 థియేటర్స్‌లోకి రాబోతుంది.

ఈ మూవీ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు మేకర్స్ కీలక అప్డేట్ ఇచ్చారు. ‘పెద్ది’ కీలక షెడ్యూల్ పూర్తి కాగా.. ఢిల్లీలో జరుగుతున్నట్లు ప్రకటించారు. ఢిల్లీలో భారీగా షూటింగ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా పలు చోట్ల కూడా షూటింగ్ చేయనున్నట్లు వెల్లడించారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియంతో పాటు, ఏపీ భవన్, పార్లమెంట్ బయట వీధుల్లో, ఇండియా గేట్ వద్ద షూటింగ్ చేస్తున్నారట. అలాగే పీఎం ఆఫీస్‌లో కూడా షూటింగ్ చేస్తున్నారట. ప్రైమ్ మినిస్టర్ మ్యూజియం, లైబ్రరీ – ప్రధానమంత్రి సంగ్రహాలయలో కూడా షూటింగ్ చేస్తున్నారని సమాచారం. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించడంతో ప్రేక్షకుల్లో అంచనాలు మరింత పెరుగుతున్నాయి.

link

Read More..

హీరోయిన్ల సామాన్ల వివాదంలోకి ‘పెద్ది’ సినిమా.. హాట్ టాపిక్‌గా మారిన వ్యవహారం!

‘ఛాంపియన్’ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్.. పోస్ట్ వైరల్

Next Story