‘ఛాంపియన్’ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్.. పోస్ట్ వైరల్

by I. Sairam |

యంగ్ హీరో రోషన్(Roshan Meka), అనస్వర రాజన్(Anaswara Rajan) జంటగా నటించిన సినిమా 'ఛాంపియన్'(Champion).

‘ఛాంపియన్’ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్.. పోస్ట్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ హీరో రోషన్(Roshan Meka), అనస్వర రాజన్(Anaswara Rajan) జంటగా నటించిన సినిమా 'ఛాంపియన్'(Champion). ప్రదీప్ అద్వైత్(Pradeep Adhwaith) దర్శకత్వం వహించిన ఈ సినిమాను స్వప్న సినిమాస్, జీ స్టూడియోస్, ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ కాన్సెప్ట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఇక నందమూరి కళ్యాణ్ చక్రవర్తి, అర్చన కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీ నిన్న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అయి మంచి టాక్‌తో దూసుకుపోతుంది.

సుమారు రూ.30 కోట్లతో తీసిన ఈ సినిమాకు మొదటి రోజు బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఇందులో భాగంగా ఫస్ట్ డే 4.50+ కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించినట్లు నిర్మాణ సంస్థ అఫీషియల్‌గా ప్రకటిచింది. ఈ మేరకు స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ.. ‘సినిమా థియేటర్లలో హౌస్ ఫుల్ పండుగ జరుగుతుంది.

పీపుల్స్ #CHAMPION మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 4.5 కోట్లకు పైగా గ్రాస్‌తో ఘనంగా ప్రారంభమైంది.. ఇప్పుడే పెద్ద తెరపై చారిత్రాత్మక ప్రయాణాన్ని అనుభవించండి’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. కాగా వీకెండ్‌లో ఈకలెక్షన్స్ ఇంకా పెరిగే చాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

Next Story