అంగరంగ వైభవంగా Manjima- Gautham Karthik పెళ్లి..

by Disha Web Desk 6 |
అంగరంగ వైభవంగా Manjima- Gautham Karthik పెళ్లి..
X

దిశ, సినిమా: 'సాహసం శ్వాసగా సాగిపో' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది మంజిమా మోహన్. ఆమె సీనియర్‌ హీరో కార్తీక్‌ కుమారుడు యంగ్‌ హీరో గౌతం కార్తీక్‌‌తో ప్రేమలో పడినట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వినిపించాయి. అనుకున్నట్టుగానే ఈ జంట ఇరు కుటుంబాల అంగీకారంతో సోమవారం పెళ్లి పీట్టలెక్కారు. కుటుంబసభ్యులు, అతికొద్ది మంది సన్నిహితులు, స్నేహితల సమక్షంలో చెన్నైలోని ఓ హోటల్‌లో గౌతమ్, మంజిమాల పెళ్లి వేడుక జరిగింది. సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు సెలబ్రిటీలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. పెళ్లి దుస్తుల్లో ఎంతో అందంగా మెరిసిపోతోన్న ఈ జంటకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మిడియాలో వైరల్‌గా మారాయి. సెలబ్రిటీలతో పాటు అభిమానులు నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇవి కూడా చదవండి : అలీ కూతురు వివాహానికి తరలి వచ్చిన సెలబ్రిటీలు..



Next Story

Most Viewed