- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఐపీఎల్ ఎఫెక్ట్.. సమంత ‘మా ఇంటి బంగారం’ సినిమా వాయిదా?
బాక్సాఫీస్ కలెక్షన్లపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని భావించిన సమంత, నందిని రెడ్డి, సినిమాను జూన్ 4న విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటిస్తూ, తన సొంత బ్యానర్‌పై నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘మా ఇంటి బంగారం’. నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని మే 15న విడుదల చేస్తామని చిత్ర బృందం గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే.. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా విడుదల తేదీ మారినట్లు సినీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఐపీఎల్ (IPL) సందడి నెలకొంది. మే నెలలో అత్యంత కీలకమైన ప్లే ఆఫ్స్, ఫైనల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ సమయంలో సినిమాను విడుదల చేస్తే, ప్రేక్షకుల దృష్టి థియేటర్ల కంటే క్రికెట్ పైనే ఎక్కువగా ఉంటుందని మేకర్స్ ఆందోళన చెందుతున్నారు.
దీనివల్ల బాక్సాఫీస్ కలెక్షన్లపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని భావించిన సమంత, నందిని రెడ్డి, సినిమాను జూన్ 4న విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.కన్నడ స్టార్ హీరో యష్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా కూడా వాయిదా పడటంతో, ఆ తేదీని సమంత తన సినిమా కోసం వినియోగించుకోవాలని చూస్తున్నారు. జూన్ మొదటి వారంలో పెద్ద సినిమాల పోటీ తక్కువగా ఉండటం ‘మా ఇంటి బంగారం’ చిత్రానికి కలిసొచ్చే అంశం. దీనివల్ల సోలో రిలీజ్ దక్కడంతో పాటు వసూళ్లు కూడా ఆశాజనకంగా ఉంటాయని చిత్ర బృందం అంచనా వేస్తోంది. సమంత కెరీర్‌లో ఈ సినిమా చాలా కీలకం. సొంత నిర్మాణ సంస్థలో వస్తున్న మొదటి ప్రాజెక్ట్ కావడంతో, ప్రమోషన్స్, రిలీజ్ డేట్ విషయంలో ఎక్కడా తగ్గకూడదని ఆమె భావిస్తోంది. త్వరలోనే ఈ వాయిదాపై చిత్ర బృందం నుండి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
ఫొటోగ్రాఫర్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన స్టార్ బ్యూటీ.. వీడియో వైరల్






