ఫొటోగ్రాఫర్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన స్టార్ బ్యూటీ.. వీడియో వైరల్

by Mallepaka Hamsa |   (  Updated:2026-04-30 05:07:30  IST  )

షూటింగ్ ముగించుకుని ఆమె బయటకు వస్తున్న సమయంలో, కొందరు ఫొటోగ్రాఫర్లు కెమెరాలను ఆమెకు అత్యంత దగ్గరగా తీసుకెళ్లి ముఖాన్ని, బాడీని జూమ్ చేయడం ఆమె గమనించింది.

ఫొటోగ్రాఫర్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన స్టార్ బ్యూటీ.. వీడియో వైరల్
X

దిశ, సినిమా: సినీ రంగంలోని హీరోయిన్లకు తరచూ ఫొటోగ్రాఫర్ల వల్ల ఏదో ఒక చేదు అనుభవం ఎదురవుతూనే ఉంటుంది. ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల్లో లేదా ఈవెంట్స్‌లో ఫొటోగ్రాఫర్లు ప్రవర్తించే తీరుపై ఇప్పటికే పలువురు నటీమణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కెమెరాలను బాడీ పార్ట్స్‌కు దగ్గరగా తీసుకెళ్లి జూమ్ చేయడంపై అసహనం వ్యక్తం చేసిన ఘటనలు మనం చూశాం. తాజాగా బాలీవుడ్ నటి కరిష్మా కపూర్‌కు కూడా ఇలాంటి ఘటనే ఎదురైంది. కరిష్మా కపూర్ ప్రస్తుతం సోనీ టీవీలో ప్రసారం కానున్న ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఇండియాస్ బెస్ట్ డ్యాన్సర్’ సీజన్-5 షూటింగ్‌లో పాల్గొంటోంది. షూటింగ్ ముగించుకుని ఆమె బయటకు వస్తున్న సమయంలో, కొందరు ఫొటోగ్రాఫర్లు కెమెరాలను ఆమెకు అత్యంత దగ్గరగా తీసుకెళ్లి ముఖాన్ని, బాడీని జూమ్ చేయడం ఆమె గమనించింది.

దీనిపై కరిష్మా వెంటనే స్పందిస్తూ.. "దయచేసి అలా జూమ్ చేయకండి" అని హెచ్చరించింది. ఆమె సీరియస్‌గా చెప్పినప్పటికీ, చాలా సున్నితంగా, పద్ధతిగా చెప్పడం అందరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చాలా కాలం తర్వాత కరిష్మా కపూర్ మళ్ళీ బుల్లితెరపై సందడి చేయబోతోంది. మే 9, 2026 నుండి ప్రారంభం కానున్న ‘ఇండియాస్ బెస్ట్ డ్యాన్సర్’ సీజన్ 5లో ఆమె జడ్జ్‌గా వ్యవహరించనుంది. ఆమెతో పాటు గీతా కపూర్, టెరెన్స్ లూయిస్, జావేద్ కూడా జడ్జిలుగా అలరించబోతున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే, కరిష్మా ప్రస్తుతం ‘బ్రౌన్’ అనే ఓటీటీ సిరీస్‌లో నటిస్తూ బిజీగా ఉంది. నటీమణుల వ్యక్తిగత ప్రైవసీని గౌరవించాల్సిన బాధ్యత ఫొటోగ్రాఫర్లపై ఉందంటూ ఈ ఘటనపై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

పెళ్లై భార్య ఉన్నప్పటికీ గర్ల్‌ఫ్రెండ్‌తో సహజీవనం.. స్టార్ హీరో బండారం బయటపెట్టిన జేడీ చక్రవర్తి.. దుమారం రేపుతున్న కామెంట్స్

Next Story