- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆదిత్య ధర్ పతనం కోసం ఇండస్ట్రీ వెయిటింగ్.. ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు
ఇండస్ట్రీకి ఆయనంటే కోపం, అసూయ. అందుకే ఆదిత్య, యామీలు ఎప్పుడు తప్పు చేస్తారా? ఎప్పుడు కింద పడతారా అని అందరూ ఎదురుచూస్తున్నారు

దిశ, సినిమా: సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) మరోసారి తనదైన శైలిలో హాట్ కామెంట్స్ చేసి సినిమా ఇండస్ట్రీలో దుమారం రేపారు. బాలీవుడ్ దర్శకుడు ఆదిత్య ధర్ ప్రతిభను ప్రశంసిస్తూనే, ఇండస్ట్రీలో ఆయనపై ఉన్న కుళ్లును బయటపెట్టారు. ఆదిత్య ధర్, ఆయన భార్య, నటి యామీ గౌతమ్ పతనం కోసం ఇండస్ట్రీ మొత్తం వేచి చూస్తోందని వర్మ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. ఆదిత్య ధర్ తెరకెక్కించిన స్పై థ్రిల్లర్ ‘ధురంధర్’ చూసినప్పటి నుండి వర్మ ఆయనకు ఫ్యాన్ అయిపోయారు. ‘‘ఆదిత్య ధర్ సినిమా తీసే విధానం మొత్తం మార్చేశాడు. కథ చెప్పే తీరులో కొత్త గ్రామర్‌ను తీసుకొచ్చాడు. హిందీలోనే కాదు, తెలుగులో కూడా ఆయన ప్రభావం కనిపిస్తోంది. ఆదిత్య ధర్ మేకింగ్ స్టైల్ చూశాక, టాలీవుడ్‌లో రాబోయే చాలా భారీ బడ్జెట్ యాక్షన్ సినిమాలు షూటింగ్ ఆపేసి మరీ రీ-షూటింగ్ చేసుకుంటున్నాయి.
దీనివల్ల నిర్మాతలపై బడ్జెట్ భారం పడుతోంది. అందుకే ఇండస్ట్రీకి ఆయనంటే కోపం, అసూయ. అందుకే ఆదిత్య, యామీలు ఎప్పుడు తప్పు చేస్తారా? ఎప్పుడు కింద పడతారా అని అందరూ ఎదురుచూస్తున్నారు’’ అని వర్మ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇక ఈ విషయం గురించి తెలుసుకున్న నెటిజన్లు వర్మపై విమర్శలు గుప్పిస్తున్నాయి. కాగా.. రణ్‌వీర్ సింగ్ హీరోగా వచ్చిన ‘ధురంధర్’ మొదటి భాగం ప్రపంచవ్యాప్తంగా 1300 కోట్ల రూపాయలు వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఇప్పుడు దీని సీక్వెల్ ‘ధురంధర్: ది రివెంజ్’ విడుదలకు సిద్ధమైంది. వాస్తవానికి ఈ సినిమా యష్ నటించిన ‘టాక్సిక్’తో తలపడాల్సి ఉంది, కానీ ‘టాక్సిక్’ వాయిదా పడటంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తో ఢీకొట్టబోతోంది. మార్చి 19న ఈ రెండు భారీ చిత్రాలు విడుదలవుతుండటంతో బాక్సాఫీస్ వద్ద యుద్ధం తప్పేలా లేదు.






