Tamannaah Bhatia : షూటింగ్ లో తమన్నాను లాగిపెట్టి కొట్టిన డైరెక్టర్..?

by Dishafeatures1 |
Tamannaah Bhatia : షూటింగ్ లో తమన్నాను లాగిపెట్టి కొట్టిన డైరెక్టర్..?
X

దిశ, సినిమా: సినీ పరిశ్రమలోకి వచ్చి 19 సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పటికి స్టార్ హీరోయిన్‌గా ఇప్పటికే కెరీర్ కొనసాగిస్తుంది తమన్నా భాటియా. తన క్రేజ్ ఎక్కడ కూడా పడిపొకుండా ఉండేదుకు హద్దులు కూడా చేరిపేసి ప్రస్తుతం పలు వెబ్ సిరీస్ లతో, మంచి మంచి అవకాశాలు అందుకుంటూ కెరీర్‌లో దూసుకుపోతోంది. అయితే తాజాగా సోషల్ మీడియాలో తమన్నాకు సంబంధించి ఓ వార్త వైరల్ అవుతోంది. ఏంటీ అంటే..

ఓ మూవీ షూటింగ్ సమయంలో డైరెక్టర్ అడిగిన హావభావాలు ఇవ్వకపోవడం.. సీన్ కోసం ఎక్కువ టేక్స్ తీసుకోవడంతోపాటు దర్శకుడిని బాగా విసిగించిందట తమన్నా. దీంతో తారస్థాయికి చేరుకున్న కోపంతో ఆ డైరెక్టర్ తమన్నాను లాగిపెట్టి కొట్టాడు. షూటింగ్‌లో ఉన్నవారంతా షాక్ అయ్యారు. అయితే తమన్నా మాత్రం ఈ విషయాన్ని చాలా లైట్‌గా తీసుకుంది.ఎందుకు అంటే ముందు నుండి ఆ డైరెక్టర్ ఆమెకు మంచి స్నేహితుడట. తర్వాత మాత్రం అతని సినిమాలు చేయలేదంట. అతణ్ని దూరంగా పెట్టింది. ప్రస్తుతం తెలుగు, తమిళ పరిశ్రమల్లో ఈ వార్త వైరల్ గా మారింది.

Read More..

నా గుండె పగిలిపోయేలా ఉంది.. యాంకర్ సుమ ఎమోషనల్ ట్వీట్

Next Story