Sara Tendulkar : అడ్డంగా బుక్కయిన సచిన్ కూతురు.. అదే కాఫీ షాపులో

by Prasanna |
Sara Tendulkar : అడ్డంగా బుక్కయిన సచిన్ కూతురు.. అదే కాఫీ షాపులో
X

దిశ, సినిమా: సచిన్‌ కూతురు సారా టెండూల్కర్‌, ఇండియన్ యంగ్ క్రికెటర్ శుభ్‌మన్ గిల్‌ డేటింగ్ ఇష్యూ మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. కొంతకాలంగా వీరిద్దరు ప్రేమలో ఉన్నారంటూ పుకార్లు షికార్లు చేసిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా వాలెంటైన్స్‌డే రోజున గిల్‌ నెట్టింట పోస్ట్ చేసిన ఫొటోలు చర్చనీయాంశమయ్యాయి. ఈ మేరకు సారా, గిల్ ఇద్దరూ కూర్చొని కాఫీ తాగిన హోటల్ వాతావరణం, బ్యాక్‌గ్రౌండ్, టేబుల్ అన్ని మ్యాచింగ్ అవడంతో.. కలిసే వెళ్లారని, లవర్స్ డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారంటూ హంగామా చేస్తున్నారు నెటిజన్లు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. కానీ వీటిని పరిశీలించి చూస్తే.. ఆ హోటల్‌లో సారా దిగిన ఫొటో రెండేళ్ల క్రితంకు సంబంధించినది కాగా.. అదే హోటల్లో్ ఫిబ్రవరి 14న గిల్ ఫొటో దిగి అభిమానులతో పంచకోవడం విశేషం.

Next Story

Most Viewed