తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సిందే.. చంద్రబాబు మాస్ వార్నింగ్

by Rajesh |
తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సిందే.. చంద్రబాబు మాస్ వార్నింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: తప్పు చేసిన వారిని వదిలిపెట్టబోమని.. వారికి శిక్ష పడాల్సిందే అని టీడీపీ చీఫ్, ఏపీకి కాబోయే సీఎం చంద్రబాబు అన్నారు. మంగళవారం ఎన్డీయే కూటమి ఎమ్మెల్యేల శాసనసభాపక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. కక్ష సాధింపు చర్యలు ఎప్పుడూ కూడా సరికావన్నారు. ప్రజాక్షేత్రంలో గెలిచి అసెంబ్లీ గౌరవం పెంచుతానని బయటకు వచ్చినట్లు గుర్తు చేశారు. రాష్ట్రానికి ఎంత అప్పు ఉందో ఇప్పటి వరకు తెలియదన్నారు. నిన్నటి వరకు విర్రవీగిన అహంకారం ఏపీలో కూలిపోయిందని పరోక్షంగా మాజీ సీఎం జగన్ ను ఉద్దేశించి అన్నారు. తప్పు చేసినవాడిని క్షమిస్తే అలవాటుగా మారుతుందని తెలిపారు.

సీఎంగా తాను రేపు నాలుగోసారి ప్రమాణం చేయబోతున్నానని.. రేపటి ప్రమాణానికి ఉన్న ప్రాధాన్యత వేరు అన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం మోడీ హామీ ఇచ్చారన్నారు. ఎన్ఆర్ఐ‌లు కూడా వచ్చి పోలింగ్‌లో పాల్గొన్నారు. ప్రజల తీర్పుతో మనపై బాధ్యత పెరిగిందన్నారు. జిల్లాలు జిల్లాలను క్లీన్ స్వీప్ చేశామని చెప్పారు. కడపలో 5 సీట్లు గెలవడం చరిత్ర అని తెలిపారు. పవన్ కల్యాణ్ 21 సీట్లకు 21 స్థానాలు గెలిచారని.. బీజేపీ 10కి 8 సీట్లు గెలిచిందన్నారు. అభ్యర్థులు గట్టిగా నిలబడ్డ చోట ప్రజలు ఆదరించారన్నారు. ఈ గెలుపుతో ఢిల్లీలో ఏపీ గౌరవం, ప్రతిష్ట పెరిగిందని కొనియాడారు. పవన్ సమయస్ఫూర్తిని ఎప్పుడూ మరిచిపోనూ అన్నారు.

జైలులో నన్ను కలిసి పరామర్శించారని.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని చెప్పారని గుర్తు చేశారు. టీడీపీతో పొత్తు పెట్టుకుంటామని పవన్ చెప్పారని.. అప్పటికే బీజేపీతో పవన్ కు పొత్తు ఉందని తెలిపారు. మనస్ఫూర్తిగా పవన్ ను అభినందిస్తున్నా అన్నారు. మా మధ్య ఎలాంటి పొరపొచ్చాలు లేవన్నారు. తమతో బీజేపీ నేతలు కూడా కలిసొచ్చారని.. పవన్, తాను కలిసి జిల్లా పర్యటన చేశామన్నారు. బీజేపీ అగ్రనేతలు కూడా రాష్ట్రంలో పర్యటించారన్నారు. విజయవాడలో కూటమి రోడ్ షోను మోడీ అభినందించారు. తానేప్పుడూ రాగద్వేషాలకు అతీతంగా పనిచేశానని తెలిపారు. తనకు ప్రజాహితమే తెలుసు అని చెప్పారు.



Next Story

Most Viewed