బ్యాంకు మేనేజర్‌‌కే సైబర్ నేరగాళ్ల కుచ్చుటోపి

by Rajesh |
బ్యాంకు మేనేజర్‌‌కే సైబర్ నేరగాళ్ల కుచ్చుటోపి
X

దిశ, నాగర్‌కర్నూల్ : సైబర్ నేరాలపై ఖాతాదారులకు అవగాహన కల్పించి, మోసపోకుండా చూడాల్సిన ఓ బ్యాంకు మేనేజరే వారి చేతిలో సైబర్ క్రైమ్ నేరస్తుల చేతిలో బలయ్యాడు. తన ఫోన్‌కు వచ్చిన మేసేజ్‌ను క్లిక్ చేసిన మేనేజర్‌కు సైబర్ నేరగాళ్లు న్యూడ్ ఫొటోస్ షేర్ చేస్తామంటూ బెదిరింపులకు గురి చేయడంతో మేనేజర్ రూ.1లక్ష 56 వేలు వారి ఖాతాలో జమ చేశారు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ బ్యాంకులో పనిచేస్తున్న మేనేజర్ ఫోన్‌కి వారం రోజుల క్రితం మెసేజ్ రూపం ఒక లింక్ వచ్చింది. వెంటనే ఆ లింక్ ఓపెన్ చేయడంతో ఫొన్ హాక్ చేశారు. సైబర్ నేరగాళ్ళు తన వాట్సాప్ డిపిని న్యూడ్ ఫోటోగా చిత్రీకరించి బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టారు. మొదట్లో వాళ్లు అడిగినట్లు డబ్బులు ఇచ్చాడు. వాళ్ళ వికృత చేష్టలకు భయపడి రూ. లక్షా 56 వేల రూపాయలు ఇచ్చినా వదలలేదు. బ్యాంకు మేనేజర్ కాంటాక్ట్స్‌లో ఉన్న 300 మందికి న్యూడ్ ఫోటోలను పంపి ఇంకా ఎక్కువ డబ్బులు కావాలని డిమాండ్ చేశారు. దింతో మోసపోయానని గ్రహించిన బ్యాంకు మేనేజర్ చేసేదేమీ లేక తీవ్ర ఆవేదనతో నాగర్ కర్నూల్ సైబర్ క్రైమ్ పోలీసులకు సోమవారం రాత్రి ఫిర్యాదు చేశాడు.

Next Story

Most Viewed