టిల్లును ఫాలో అవ్వాలంటున్న నిపుణులు.. ప్రతి భర్త తప్పకుండా తెలుసుకోవాల్సిన సీక్రెట్ మ్యాటర్ ఇదే!

by Samataha |
టిల్లును ఫాలో అవ్వాలంటున్న నిపుణులు.. ప్రతి భర్త తప్పకుండా తెలుసుకోవాల్సిన సీక్రెట్ మ్యాటర్ ఇదే!
X

దిశ, ఫీచర్స్ : అందరికీ టిల్లు మూవీ తెలిసిందే. ఎందుకంటే లిప్ కిస్ సీన్స్ ఎక్కువగా ఉన్న మూవీ అంటే ఇదే అంటారు కొందరు. అయితే ఇప్పుడు ఈ లిప్ కిస్ గోల ఏంటీ అనుకుంటున్నారా? వైవాహిక బంధం బలంగా ఉండాలన్నా, దపతుల మధ్య ప్రేమ పెరగాలన్నా టిల్లును ఫాలో కావాలి అంటున్నారు నిపుణులు. అదేంటి? ఎందుకు అలా అనేగా మీ డౌట్. ఇప్పుడు అసలు ముచ్చటలోకి వెళ్దాం.

ప్రస్తుతం వైవాహిక బంధంలో ఎక్కువగా కలహాలు వస్తున్నాయి. భార్యభర్తల మధ్య గ్యాప్ రావడం, మనస్పర్థలు పెరిగిపోవడం, ఇది డివోర్స్ వరకు వెళ్లడం జరుగుతుంది. అయితే దీనికి ముఖ్యకారణం తమ భర్తత తమతో సంతోషంగా గడపకపోవడం, ఫ్యామిలీ కంటే వర్క్‌నే ఎక్కుగా పట్టించుకోవడం అంటున్నారు కొందరు. ఇక కొందరు భార్యలైతే తమ భర్త ఆఫీసుకు వెళ్తున్నాడంటే బాధపడిపోతుంటారు. తాను ఎప్పుడు ఇంటికి వస్తారా అని ఎదురు చూస్తుంటారు. మూడీగా ఫీల్ అవుతారు. ఇంకొందరు తన భర్త ఆఫీసుకు వెళ్లే సమయంలో కౌగిలించుకోవడం, లేదా కిస్ ఇవ్వడానికి ఇష్టపడుతారు. కానీ భర్తలు అవి ఏమీ పట్టించుకోకుండా హడావిడిగా ఆఫీసుకు వెళ్తుంటారు. ఇదే వారి పచ్చటి కాపురానికి చిచ్చు పెడుతుంది. అయితే దీని నుంచి బయటపడాలి అంటే 6 సెకన్ల కిస్ ఫార్ముల ఫాలో కావాలి అంటున్నారు నిపుణులు. దీని వలన బంధం బలంగా ఉంటుందంట.

భార్యల మనస్తత్వం ఒక్కో విధంగా ఉంటుందంట. మరీ ముఖ్యంగా వారు తమ భర్తతో ఆనందంగా గడపాలని ఆశపడుతుంటారంట. అందువలన ఇతడిని అనవసరంగా పెల్లి చేసుకున్నాం అనే ఆలోచన వారికి రాకుండా భర్త చూసుకోవాలి అంటున్నారు. వారిని ఆనంద పరిచే బెస్ట్ మెడిసన్ ఈ ముద్దేనంట. అయితే తాజాగా చేసిన ఓ సర్వేలో షాకింగ్ విషయాలు వెళ్లడి అయ్యాయి. అందులో ఒకటి ముద్దు. పనికి వెళ్లే ముందు భర్త భార్యను ముద్దుపెట్టుకుంటే ఆ పరుషులు 4 సంవత్సరాలు ఎక్కువ కాలం జీవిస్తారంట. మరీ ముఖ్యంగా ఆరు సెకన్ల ముద్దు మరితం ఆరోగ్యాన్ని అందించడమే కాకుండా, బంధాన్ని బలపరిచి, ప్రేమను రెట్టింపు చేస్తుందంటున్నారు పరిశోధకలు. తమ భార్యకు ఆఫీసుకు వెళ్లే ముందు ఆరు సెకన్ల పాటు లిప్ కిస్ ఇవ్వడం ద్వారా ఆక్సిటోసిన్ విడుదల అవుతుంది. ఇది మీ భాగస్వామి మనసులో భావోద్వేగ భద్రత బంధాన్ని సృష్టిస్తుందంట. దీని వలన మీ మధ్య ఉన్న ప్రేమ, బంధం బలపడటమే కాకుండా, నా వాడు నాతోనే ఉంటాడు అనే ఫీలింగ్ భార్యకు కలుగుతుందని వారు చెబుతున్నారు. అందువ వలన ప్రతి భర్త ఈ ఆరు సెకన్ల కిస్ ఫార్ముల ఫాలో కావాలని వారు సూచిస్తున్నారు.

Next Story

Most Viewed