జూన్-11: పసిడి ప్రియులకు షాక్.. నేడు బంగారం ధర ఎంత పెరిగిందంటే?

by Hamsa |
జూన్-11: పసిడి ప్రియులకు షాక్.. నేడు బంగారం ధర ఎంత పెరిగిందంటే?
X

దిశ, ఫీచర్స్: ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా మహిళలు బంగారం కొనుగోలు చేస్తుంటారు. అయితే గత కొద్ది కాలంగా బంగారం ధరలు తగ్గుతూ, పెరుగుతూ టెన్షన్ పెట్టిస్తున్నాయి. మూడు నెలల పాటు ముహూర్తాలు లేకపోవడంతో కొనుగోలు దారులు పసిడి రేట్లు తగ్గుతాయని భావించారు. కానీ మళ్లీ శుభకార్యాలు మొదలవడంతో.. బంగారం ధరలు పెరుగుతున్నాయి. దీంతో బంగారం పేరు చెప్తేనే కొందరు భయపడుతున్న పరిస్థితి నెలకొంది. దానికి కారణం బంగారం ధరలు ఊహించని విధంగా పెరుగుతుండటంతో అంతా అయోమయంలో పడి పోయారు.

నిన్నటి ధరలతో పోల్చుకుంటే నేడు బంగారం ధరలు పెరిగి మహిళలకు షాకిచ్చాయి. అయితే 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 150 పెరగ్గా రూ. 65, 850కి చేరుకుంది. అలాగే 24 క్యారెట్ల బంగారంపై రూ. 170 పెరగ్గా రూ. 71, 840కి విక్రయిస్తున్నారు. అలాగే కిలో వెండి ధరలు తగ్గడంతో రూ. 1200 తగ్గగా రూ.95, 000గా ఉంది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

హైదరాబాద్‌లో నేటి బంగారం ధరలు:

22 క్యారెట్ల బంగారం ధర- రూ. 65,850

24 క్యారెట్ల బంగారం ధర- రూ. 71, 840

విజయవాడలో నేటి బంగారం ధరలు:

22 క్యారెట్ల బంగారం ధర- రూ. 65,850

24 క్యారెట్ల బంగారం ధర- రూ. 71, 840

Next Story

Most Viewed