- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహిళల వస్త్రధారణ వివాదం.. శివాజీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ మంచు మనోజ్ సెన్సేషనల్ పోస్ట్
టాలీవుడ్ నటుడు శివాజీ(Shivaji) ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘దండోరా’. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా క్రిస్మస్ కానుకగా విడుదల కాబోతుంది.

దిశ, సినిమా: టాలీవుడ్ నటుడు శివాజీ(Shivaji) ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘దండోరా’. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా క్రిస్మస్ కానుకగా విడుదల కాబోతుంది. ఈక్రమంలో.. తాజాగా, మేకర్స్ ఓ ఈవెంట్ నిర్వహించగా.. ఇందులో పాల్గొన్న శివాజీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడ్డారు. ఈ కామెంట్స్ సినీ ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. స్త్రీ అందం చీరకట్టులో, ఒళ్లు కనిపించకుండా వేసుకునే బట్టలోనే ఉంటుందని అన్నారు. అసభ్యకరంగా బట్టలు వేసుకుంటే.. అందులో విలువేముంటుందని? హీరోయిన్లు పొట్టిబట్టలు వేసుకున్నప్పుడు బయటకు అందరూ పొగిడినా లోప అసహ్యించుకుంటారని బూతు పదాలను వాడారు.గ్లామర్ అనేది హద్దుల్లోనే ఉండాలని చేసిన వ్యాఖ్యలపై దుమారం రేపుతున్నాయి.
హీరోయిన్లు చీరలు కట్టుకోకపోతే వారి సామాన్లు కనిపిస్తాయని చెప్పడంతో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే ఈ విషయంపై అనసూయ, చిన్మయి స్పందించి శివాజీకి స్ట్రాంగ్‌గా సమాధానాలు ఇచ్చారు. తాజాగా, మంచు మనోజ్ (Manchu Manoj)ట్విట్టర్ ద్వారా ఓ వీడియోను షేర్ చేసి శివాజీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. ‘‘శివాజీ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15, 21లను ఉల్లంఘించేలా ఉన్నాయి. సమానత్వం, గౌరవం, వ్యక్తిగత స్వేచ్ఛ అనేవి చర్చించలేని అంశాలు. మహిళల బట్టలపై తీర్పు ఇచ్చే అధికారం ఎవరికీ లేదు. మహిళలను కించపరిచేలా వస్తువులుగా చూస్తూ మాట్లాడిన ఆ సీనియర్ నటుడి తరపున నేను క్షమాపణలు చెబుతున్నాను. అటువంటి మాటలు పురుషులందరి అభిప్రాయం కాదు.
పబ్లిక్ ఫిగర్స్‌గా ఉన్నవారు సమాజంపై తమ మాటల ప్రభావం ఉంటుందని గుర్తించి బాధ్యతగా మాట్లాడాలి. ఇలాంటి ప్రవర్తనను సాధారణీకరించడం లేదా మౌనంగా భరించడం ఇకపై కుదరదు. మహిళలకు గౌరవం, సమానత్వం దక్కాలి. ఇలాంటి విషయాల్లో మౌనంగా ఉండటం సరైన పద్ధతి కాదు’’ అని రాసుకొచ్చారు. ఈ పోస్ట్ చూసిన సినీ సెలబ్రిటీలు, నెటిజన్లు మనోజ్‌కు సపోర్ట్‌గా నిలుస్తున్నారు. అంతేకాకుండా శివాజీ బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ ఆయనను ట్రోల్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం శివాజీ చేసిన వ్యాఖ్యల్లో తప్పేముందని వాదిస్తున్నారు.
READ MORE ....
‘ఇలాంటి నీతులు నీ ఇంట్లో వాళ్లకు చెప్పుకో’.. శివాజీకి ఇచ్చిపడేసిన ఆర్జీవీ.. పోస్ట్ వైరల్






