‘ఇలాంటి నీతులు నీ ఇంట్లో వాళ్లకు చెప్పుకో’.. శివాజీకి ఇచ్చిపడేసిన ఆర్జీవీ.. పోస్ట్ వైరల్

by Mallepaka Hamsa |   (  Updated:2025-12-23 13:50:49  IST  )

నటుడు శివాజీ(Shivaji) ‘దండోరా’ మూవీ ఈవెంట్‌లో మహిళ వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

‘ఇలాంటి నీతులు నీ ఇంట్లో వాళ్లకు చెప్పుకో’.. శివాజీకి ఇచ్చిపడేసిన ఆర్జీవీ.. పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా: నటుడు శివాజీ(Shivaji) ‘దండోరా’ మూవీ ఈవెంట్‌లో మహిళ వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ కామెంట్స్ వివాదాస్పదంగా మారి అందరికీ ఆగ్రహం వచ్చేలా చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో శివాజీపై నెగెటివిటీ మొదలైపోయింది. పలువురు సినీ ప్రముఖులు ఆయనపై మండిపడుతున్నారు. ఇప్పటికే శివాజీ వ్యాఖ్యలను తప్పబడుతూ చిన్మయి, అనసూయ, మంచు మనోజ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. గత రెండు రోజులుగా ఈ టాపిక్‌పై ఎన్నో వార్తలు వైరల్ అవుతూ.. మహిళా నటీమణులకు కోసం వచ్చేలా చేస్తున్నాయి. తాజాగా, ఈ విషయంపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma)స్పందించారు.

ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా ఓ సంచలన పోస్ట్ పెట్టారు. ‘‘నాకు ఆ వ్యక్తి పూర్తి పేరు తెలియదు, అందుకే నేను ఇక్కడ ఇలా వ్యాఖ్యానిస్తున్నాను... హే శివాజీ, నువ్వు ఎవరైనా సరే, నీ ఇంట్లోని మహిళలు నీలాంటి మొరటు, మురికి మనిషిని భరించడానికి సిద్ధంగా ఉంటే, నువ్వు వారిని నైతికత పేరుతో నియంత్రించుకో. సమాజంలో, సినిమా పరిశ్రమలో లేదా మరెక్కడైనా ఉన్న ఇతర మహిళల విషయాలపై నీ చెత్త అభిప్రాయాలను రుద్దకు’’ అని రాసుకొచ్చారు. ప్రజెంట్ ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుండగా.. అది చూసిన నెటిజన్లు కరెక్ట్‌గా చెప్పారని కామెంట్లు పెట్టగా.. అమ్మాయిలు ఆయనకు థాంక్యూ చెబుతున్నారు.

READ MORE ....

మహిళల వస్త్రధారణ వివాదం.. శివాజీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ మంచు మనోజ్ సెన్సేషనల్ పోస్ట్

Next Story