- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్ ప్రభుత్వం లైంగిక హింసను సమర్థిస్తోంది.. ఇది చాలా దారుణమంటూ చిన్మయి సంచలన ట్వీట్
సింగర్ చిన్మయి(Chinmayi) గురించి ఎంత చెప్పినా తక్కువే.

దిశ, సినిమా: సింగర్ చిన్మయి(Chinmayi) గురించి ఎంత చెప్పినా తక్కువే. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ, సమాజానికి సంబంధించిన అంశాలపై తన అభిప్రాయాలను ధైర్యంగా వ్యక్తపరుస్తూ తరచూ వార్తల్లో నిలుస్తుంటుంది. ముఖ్యంగా మహిళల హక్కులు, లైంగిక వేధింపులపై ఆమె చేసే వ్యాఖ్యలు ఎప్పటికప్పుడు చర్చకు దారి తీస్తుంటాయి. ఇక ఇటీవల ‘దండోరా’ ఈవెంట్‌లో శివాజీ హీరోయిన్లపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీయగా, ఈ అంశంపై కూడా చిన్మయి తీవ్రంగా స్పందించింది. ఈ విషయంలో ఆమెతో పాటు అనసూయ కూడా అదే స్థాయిలో శివాజీ వ్యాఖ్యలను ఖండిస్తూ సోషల్ మీడియాలో వరుస పోస్టులు పెట్టింది. దీంతో ఈ వ్యవహారం మరింత ముదిరి పెద్ద దుమారంగా మారింది. సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు కూడా ఈ అంశంపై స్పందిస్తూ తమ అభిప్రాయాలను వెల్లడించడంతో విషయం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ఈ క్రమంలో ఓ కాంగ్రెస్ మహిళా నాయకురాలు టీవీ డిబేట్‌లో చేసిన వ్యాఖ్యలు మరింత సంచలనంగా మారాయి. ఈ నేపథ్యంలో, తాజాగా చిన్మయి ఒక ఘాటు ట్వీట్ చేస్తూ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ‘‘టెలివిజన్ చర్చల్లో ఈ స్థాయి ప్రవర్తనను కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తుందా? లేక ఈ తరహా మనస్తత్వానికి పార్టీ ఉన్నత నాయకత్వం మద్దతు ఉందా?’’ అని ఆమె ప్రశ్నించింది. ఓ సినిమా ఈవెంట్‌లో ఒక నటుడు తన సహనటిపై బూతులు తిడుతూ అవమానించిన ఘటన తర్వాత, మహిళల దుస్తులు, నైతికతపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో విస్తృత చర్చ జరిగిందని ఆమె గుర్తు చేసింది. దీనిని కొందరు ‘ఆందోళన’గా అభివర్ణించడాన్ని కూడా ఆమె తప్పుబట్టింది. టీవీ ఛానెళ్లలో జరిగిన చర్చల్లో వినిపించినఅసభ్య పదజాలం మీడియా స్థాయిని దిగజార్చాయి మహిళల దుస్తులపై ఆంక్షలు విధించడం వల్ల లైంగిక వేధింపులు ఆగవని అనేక మంది మహిళలు చెప్పినా, వాటిని పట్టించుకోకపోవడం దారుణమని పేర్కొంది.
డిబేట్‌లో పాల్గొన్న ఒక మహిళ కాంగ్రెస్ నాయకురాలేనన్న సమాచారం మరింత ఆందోళన కలిగిస్తోందని, ఆమె చేసిన వ్యాఖ్యలు అత్యంత ప్రమాదకరమైన ఆలోచనలకు దారితీస్తాయని చిన్మయి ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘పురుషులు తమను తాము నియంత్రించుకోలేరన్న భావనను బలపరుస్తూ, మహిళల దుస్తులే అత్యాచారాలకు కారణమన్న తప్పుడు సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తున్నారు. ఇది మహిళలపై మాత్రమే కాదు, పిల్లలు, వృద్ధులు, మరణించినవారిపై కూడా లైంగిక హింసను సమర్థించినట్లే’’ అంటూ చిన్మయి ఫైర్ అయింది. చివరగా, ‘‘మనకు ఇలాంటి రాజకీయ నాయకులు కాదు.. నిజంగా విలువలు ఉన్న మంచి నాయకులు కావాలి. ఇది అత్యంత దారుణం’’ అంటూ తన ట్వీట్‌లో రాయడం గమనార్హం.
Read More..






