నన్ను టెర్రస్ పైకి తీసుకెళ్లి కోరికలు తీర్చుకున్నాడు.. సంచలన విషయాలు బయటపెట్టిన నటి (వీడియో)

by Mallepaka Hamsa |   (  Updated:2026-01-09 06:52:03  IST  )

బుల్లితెర నటి సమీర షరీఫ్(Sameera Sharif) గురించి పరిచయం అక్కర్లేదు.

నన్ను టెర్రస్ పైకి తీసుకెళ్లి కోరికలు తీర్చుకున్నాడు.. సంచలన విషయాలు బయటపెట్టిన నటి (వీడియో)
X

దిశ, సినిమా: బుల్లితెర నటి సమీర షరీఫ్(Sameera Sharif) గురించి పరిచయం అక్కర్లేదు., ఆడపిల్ల, మంగమ్మ గారి మనవరాలు సీరియల్స్‌‌లో నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది. కెరీర్ పీక్స్‌లో ఉండగానే పెళ్లి చేసుకుని పర్సనల్ లైఫ్‌లో ఫుల్ బిజీ అయిపోయింది. ఇద్దరు కుమారులు ఉన్న సమీరా నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన విషయాలు చెబుతుంది. అలాగే అభిమానులతో చిట్ చాట్ చేస్తుంటుంది. తాజాగా, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ సంచలన వీడియోను షేర్ చేసి అందరినీ షాక్ ‌కు గురిచేసింది. ‘‘నీ చిన్నతనంలో మా ఎదురింట్లో ఉన్న ఆంటీ వాళ్లింటికి బంధువులు వచ్చేవాళ్లు. వారిలో ఒక అన్న కూడా ఉండేవాడు. అతను నా బుగ్గలు పట్టుకుని ఎక్కువ ముద్దు చేసేవాడు.

ఆ వయసులో నాకు అర్థం కాక.. అతను నన్ను ముద్దు చేస్తున్నాడని అనుకున్నాను. నేను మా ఫ్రెండ్స్ దాగుడుమూతలు ఆడుకుంటుండగా.. అతను కూడా జాయిన్ అయ్యేవాడు. మనం ఇక్కడ దాక్కుందాం అని నన్ను టెర్రర్ పైకి తీసుకెళ్లేవాడు. అక్కడ దాక్కున్నాక నాకు ముద్దులు పెట్టేవాడు. ఒకానొక సమయంలో నాకు అసౌకర్యంగా అనిపించేది. అలాగే కొద్ది కాలం చేశాడు. కాస్త వయసు పెరిగాక నాకు అర్థమైందేంటంటే.. అతను నన్ను ముద్దుచేసేవాడు కాదు.. తన కోరికలు తీర్చుకునేవాడని తెలుసుకున్నాను. నిజం చెప్పాలంటే అది పిల్లలపై జరిగే లైంగిక దాడి లాంటిది. ఆ సమయంలో నాకు అంత అవగాహన లేకపోవడం వల్ల ముందే గమనించలేకపోయాను. కానీ ఇప్పుడున్న పరిస్థితులు వేరు. అందుకే పిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అంటే ఏంటో నేర్పించాలి.

మన పిల్లలకు అలాంటివి జరిగితే నీకు నేనున్నా అని ధైర్యం చెప్పాలి. అలా కాకుండా తిట్టేస్తే వాళ్లు ఏదీ బయటకు చెప్పకుండా మదన పడతారు. ఒకప్పుడు నేను భయంతో చెప్పలేదు. కానీ ఎవరూ కూడా అలా చేయకండి. ఇలాంటి సంఘటనలు నాకే కాదు చాలామందికే జరుగుతాయి. వాళ్లు చూపించేది ప్రేమ కాదు.. కోరిక తీర్చుకుంటున్నారు. బయటకు చెప్పని మాట.. కానీ అది వినబడాలి.. ఒకప్పుడు నేనుగా ఉన్న ఆ చిన్నారి కోసం. గొంతు లేని ప్రతి బిడ్డ కోసం. ఇది సానుభూతి కోసం చెప్పే కథ కాదు.. ఇది అవగాహన కోసం చెప్పే నిజం.’’ అని చెప్పుకొచ్చింది. దీంతో ఈ పోస్ట్ చూసిన వారంతా గుడ్ మెసేజ్ ఇచ్చారని చెప్తూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

Read More... రైలు పట్టాలపై పడుకుని వ్యక్తి ఆత్మహత్య.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో వైరల్


Next Story