రైలు పట్టాలపై పడుకుని వ్యక్తి ఆత్మహత్య.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో వైరల్

by Kema Shiva Kumar |   (  Updated:2026-01-09 06:53:16  IST  )

అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తి రైలు పట్టాలపై పడుకుని బలవన్మరణానికి పాల్పడిన హృదయవిదారక ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దువ్వాడ రైల్వే స్టేషన్‌‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

రైలు పట్టాలపై పడుకుని వ్యక్తి ఆత్మహత్య.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తి రైలు పట్టాలపై పడుకుని బలవన్మరణానికి పాల్పడిన హృదయవిదారక ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దువ్వాడ రైల్వే స్టేషన్‌ (Duvvada Railway Station)లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. జనవరి 3న మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో హౌరా - బెంగళూరు ఎక్స్‌ప్రెస్ (Howrah - Bangalore Express) రైలు దువ్వాడ స్టేషన్‌లోని ఒకటో నంబర్ ప్లాట్‌ఫాంపైకి వస్తోంది. అదేసమయంలో అక్కడ వేచి ఉన్న వెంకటరమణ రెడ్డి (Venkataramana Reddy), రైలు దగ్గరకు రాగానే అకస్మాత్తుగా ప్లాట్‌ఫాం పైనుంచి కిందకు దూకి పట్టాలపై పడుకున్నారు. అనంతరం ట్రైన్ వెంకటరమణా రెడ్డి పైనుంచి వెళ్లడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

కాగా, మృతుడు పెదగంట్యాడ మండల పరిధిలోని నెల్లిముక్కు గ్రామానికి చెందిన నీలాపు వెంకటరమణ రెడ్డి (65)‌గా పోలీసులు గుర్తించారు. ఆయన గతంలో భారత సైన్యంలో పనిచేసి పదవీ విరమణ పొందారు. అనంతరం విశాఖ స్టీల్ ప్లాంట్‌లోని ఫీల్డ్ మిషనరీ విభాగంలో కూడా విధులు నిర్వహించినట్లుగా తెలుస్తోంది. అయితే, ప్రస్తుతం వెంకటరమణా రెడ్డి ఆత్మహత్యకు పాల్పడిన దృశ్యాలు రైల్వే స్టేషన్‌లోని సీసీ కెమెరాల్లో స్పష్టం రికార్డు అయ్యాయి. ప్రస్తుతం అందుకు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియా (Social Media)లో విపరీతంగా వైరల్ అవుతోంది.

Next Story