- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బొట్టు పెట్టుకుంటూ మురిసిపోతున్న అందాల తార.. కావేరి రాకకు రంగం సిద్ధం చేసిన మేకర్స్..
హీరోయిన్ అద్దంలో తనను తాను చూసుకుంటూ, ఎంతో పద్ధతిగా బొట్టు పెట్టుకుంటున్నట్లుగా కనిపిస్తోంది.

దిశ, సినిమా: మాస్ మహారాజా రవితేజ(Ravi Teja), క్లాస్ డైరెక్టర్ శివ నిర్వాణ(Shiva Nirvana) క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఇరుముడి’. ఇప్పటికే ఈ సినిమా టైటిల్ ,రవితేజ లుక్ సోషల్ మీడియాలో భారీ అంచనాలను క్రియేట్ చేయగా, తాజాగా చిత్ర బృందం హీరోయిన్ ఎవరనే సస్పెన్స్‌కు తెరదించింది. ఈ సినిమాలో రవితేజకు జోడీగా టాలెంటెడ్ బ్యూటీ ప్రియా భవాని శంకర్ నటిస్తోంది. రేపు (ఫిబ్రవరి 15, ఆదివారం) మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉదయం 10:10 గంటలకు ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు విడుదల చేసిన అనౌన్స్‌మెంట్ పిక్ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.
కావేరి వచ్చేస్తుంది..
ఈ పోస్టర్‌లో హీరోయిన్ అద్దంలో తనను తాను చూసుకుంటూ, ఎంతో పద్ధతిగా బొట్టు పెట్టుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. దీన్ని బట్టి సినిమాలో ప్రియా భవాని శంకర్ ఒక సంప్రదాయబద్ధమైన పాత్రలో కనిపించబోతుందని అర్థమవుతోంది. ఇందులో కావేరి పాత్రలో కనిపించబోతున్నట్లు మూవీ మేకర్స్ హింట్ ఇచ్చారు. ఇక రవితేజ పాత్రలో ఉన్న మిస్టరీకి, ప్రియా పాత్రలోని క్లాస్ టచ్‌కి మధ్య జరిగే కెమిస్ట్రీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుందని టాక్. టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. రవితేజ తన పాత వైభవాన్ని మళ్ళీ ఈ సినిమాతో అందుకుంటారని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక శివ నిర్వాణ గత చిత్రాలు 'నిన్ను కోరి', 'మజిలీ' తరహాలోనే ఇందులో కూడా బలమైన ఎమోషన్స్ ఉంటాయని టాక్.






