- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Samantha: షూటింగ్ సెట్స్‌లో మార్పు రావాల్సిందే.. సినిమా ఇండస్ట్రీలో మహిళల కష్టాలపై సమంత సంచలన వ్యాఖ్యలు!
పరిశ్రమలో మహిళలు ప్రతి చిన్న గుర్తింపు కోసం పురుషుల కంటే రెట్టింపు కష్టపడాల్సి వస్తోందని సమంత ఆవేదన వ్యక్తం చేశారు.

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు తాజాగా చిత్ర పరిశ్రమలో మహిళల స్థితిగతులు, వారి కెరీర్ ఎదుగుదలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, సినిమా రంగంలో మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లను ఎంతో ధైర్యంగా ఎత్తిచూపారు. పరిశ్రమలో మహిళలు ప్రతి చిన్న గుర్తింపు కోసం పురుషుల కంటే రెట్టింపు కష్టపడాల్సి వస్తోందని సమంత ఆవేదన వ్యక్తం చేశారు. "మనం ఇతరుల సౌకర్యం కోసం మన షెడ్యూల్స్‌ని, మన అభిప్రాయాలను, మన ఆశయాలను నిరంతరం మార్చుకుంటాం. ఇది ఒక త్యాగం అని కూడా గుర్తించలేనంతగా మనం దీనికి అలవాటు పడిపోయాం. ఒకే పరిస్థితిలో పురుషుల కంటే మహిళలు పది రెట్లు ఎక్కువగా క్షమాపణలు చెబుతారని మీకు తెలుసా? ఇక చాలు.. ఆపండి. మీరు కష్టపడి సంపాదించుకున్న గౌరవాన్ని అనుభవించే హక్కు మీకు ఉంది. అంబిషన్ అనేది క్యారెక్టర్‌లో లోపం కాదు.. అది మీ బలం" అని ఆమె స్పష్టం చేశారు. అలాగే సినిమా ప్రపంచంలో భవిష్యత్తు ఎలా ఉండాలో సమంత తన ఆలోచనలను పంచుకున్నారు.
లేడీ ఓరియంటెడ్ సినిమాలను ఒక రిస్క్ లాగానో లేదా ఒక ప్రత్యేక కేటగిరీ లాగానో చూడటం ఆపి, వాటిని కేవలం కథలు అని పిలిచే రోజు రావాలని ఆమె కోరారు. తెరపై మహిళలు కేవలం హీరోకి ధైర్యం చెప్పడానికో లేదా ఒకరి భార్యగానో పరిమితం కాకుండా, నిజ జీవితంలో ఉండే మహిళల్లాగే క్లిష్టమైన మనస్తత్వంతో ఉండాలని అన్నారు. షూటింగ్ సెట్స్‌లో మహిళల భద్రత గురించి అప్పుడప్పుడు చర్చించడం కాదు, అది ఈ పరిశ్రమకు ఒక ప్రాథమిక పునాదిలా మారాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట సంచలనంగా మారాయి. ఇక సమంత సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం సామ్ తన తదుపరి చిత్రం ‘మా ఇంటి బంగారం’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ‘ఓ బేబీ’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకురాలు నందిని రెడ్డితో కలిసి చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. దీనితో పాటు రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో ‘రక్త బ్రహ్మాండం: ది బ్లడీ కింగ్‌డమ్’ అనే భారీ ప్రాజెక్టులోనూ ఆమె నటిస్తున్నారు.






