అభిమానులకు తారక్ టీం హెచ్చరిక.. అప్రమత్తంగా ఉండాలంటూ పోస్ట్

by Mallepaka Hamsa |   (  Updated:2026-05-14 14:58:00  IST  )

తరహా వసూళ్లకు ఎన్టీఆర్‌కు గానీ, ఆయన కార్యాలయానికి గానీ ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.

అభిమానులకు తారక్ టీం హెచ్చరిక.. అప్రమత్తంగా ఉండాలంటూ పోస్ట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ పేరును వాడుకుంటూ కొందరు చేస్తున్న అక్రమ వసూళ్లపై ఆయన టీమ్ స్పందిస్తూ సోషల్ మీడియా ద్వారా ఓ కీలక నోట్ విడుదల చేశారు. అభిమానం పేరుతో జరుగుతున్న ఈ మోసాల పట్ల అభిమానులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఇటీవల కాలంలో కొందరు వ్యక్తులు, కొన్ని అభిమాన సంఘాలు ఎన్టీఆర్ పేరు చెప్పి స్వచ్ఛంద కార్యక్రమాలు, సామాజిక సేవలు చేస్తున్నామని నమ్మిస్తూ పెద్ద ఎత్తున విరాళాలు సేకరిస్తున్నట్లు ఎన్టీఆర్ కార్యాలయం దృష్టికి వచ్చిందని అన్నారు. ఎన్టీఆర్ ఇమేజ్‌ను అడ్డం పెట్టుకుని, ఆయనకు తెలియకుండానే ఈ తరహా అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారట.

ఈ విషయంపై పీఆర్ టీమ్ స్పందిస్తూ.. ఈ తరహా వసూళ్లకు ఎన్టీఆర్‌కు గానీ, ఆయన కార్యాలయానికి గానీ ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.ఎన్టీఆర్ పేరుతో జరుగుతున్న విరాళాల సేకరణను ఆయన ఏమాత్రం ఆమోదించడం లేదని, ఇవన్నీ ఆయన ప్రమేయం లేకుండా జరుగుతున్నవని వెల్లడించారు. అభిమానం పేరుతో ఎవరైనా డబ్బులు అడిగితే నమ్మవద్దని, ఇలాంటి మోసపూరిత వసూళ్ల వల్ల ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. భవిష్యత్తులో ఎన్టీఆర్ తరపున ఎలాంటి సేవా కార్యక్రమాలు ఉన్నా, లేదా అధికారిక ప్రకటనలు చేయాల్సి వచ్చినా.. అవి నేరుగా ఎన్టీఆర్ సోషల్ మీడియా ఖాతాల ద్వారా లేదా ఆయన కార్యాలయం ద్వారా మాత్రమే వెల్లడిస్తారని తెలిపారు.

ఎన్టీఆర్ బర్త్‌డే.. అభిమానులను ఫుల్ ఖుషి చేసే అప్డేట్స్ రెడీ

Next Story