- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎన్టీఆర్ బర్త్‌డే.. అభిమానులను ఫుల్ ఖుషి చేసే అప్డేట్స్ రెడీ
జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మే 20వ తేదీన ‘NTRNeel’, ‘గాడ్ ఆఫ్ వార్’, దేవర 2 చిత్రాల నుంచి అప్డేట్స్ రానున్నట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: మే 20వ తేదీన జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు కావడంతో ఆయన సినిమాలకు సంబంధించిన ఎలాంటి అప్డేట్స్ వస్తాయో అని తారక్ అభిమానులు చాలా కాలంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అభిమానులను ఏమాత్రం నిరుత్సాహపరచకుండా ఈ మే 20న భారీ ఎత్తున అప్డేట్స్‌ను మేకర్స్ విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తారక్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను తారక్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయబోతున్నట్లు సమాచారం.
అలాగే జూనియర్ ఎన్టీఆర్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ‘గాడ్ ఆఫ్ వార్’ అనే చిత్రం తెరకెక్కనున్నట్లు చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా తారక్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక తారక్ నటించిన దేవర పార్ట్ 1 మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో ‘దేవర 2’ అనౌన్స్‌మెంట్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా తారక్ పుట్టినరోజు సందర్భంగా మూడు సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ రానున్నాయనే వార్త బయటకు రావడంతో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.






