క్యారవాన్‌లో అజిత్ చేసిన పనికి తమన్నా షాక్.. ఆసక్తికర కామెంట్స్ వైరల్

by Mallepaka Hamsa |   (  Updated:2026-03-16 06:41:57  IST  )

ఇక అజిత్ గురించి చెబుతూ ఒక షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది.

క్యారవాన్‌లో అజిత్ చేసిన పనికి తమన్నా షాక్.. ఆసక్తికర కామెంట్స్ వైరల్
X

దిశ, సినిమా: టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా తన అందం, అభినయంతో రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో రాణిస్తోంది. భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలు, స్పెషల్ సాంగ్స్‌తో దూసుకుపోతున్న ఈ అమ్మడు.. తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొని తన సినీ ప్రయాణం, స్టార్ హీరోలతో తనకున్న అనుబంధం గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. తమిళంలో తాను నటించిన 'కల్లూరి' సినిమా తన కెరీర్‌లో ఎంతో ప్రత్యేకమని తమన్నా తెలిపింది. విద్యార్థులు తమ కాలేజీ జీవితాన్ని మనసారా ఆస్వాదించాలని, ఆ రోజులు మళ్లీ తిరిగి రావని ఆమె సూచించింది.

తాను ఇండస్ట్రీకి వచ్చి 21 ఏళ్లు పూర్తి చేసుకున్నా, ప్రేక్షకులు ఇప్పటికీ తనను అదే స్థాయిలో ఆదరిస్తుండటం పట్ల భావోద్వేగానికి గురవుతూ అందరికీ ధన్యవాదాలు తెలిపింది. కోలీవుడ్ స్టార్స్ గురించి మాట్లాడుతూ.. విజయ్ చాలా నిరాడంబరమైన వ్యక్తి అని, ఆయనది మంచి మనసని కొనియాడింది. అంతేకాకుండా, విజయ్, ఎన్టీఆర్ ఇద్దరూ అద్భుతమైన డ్యాన్సర్లు అని కితాబిచ్చింది. ఇక అజిత్ గురించి చెబుతూ ఒక షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది. 'వీరం' సినిమా షూటింగ్ సమయంలో అజిత్ స్వయంగా తన క్యారవాన్‌లో తనకు ఇడ్లీ చేసి పెట్టారని, ఒక స్టార్ హీరో అలా చేయడం చూసి తాను ఆశ్చర్యపోయానని చెప్పింది.

ఆయన పర్ఫెక్ట్ ఫ్యామిలీ మెన్ అని, ఆయనకు వంట చేయడం అంటే చాలా ఇష్టమని ప్రశంసించింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి తమన్నా ప్రత్యేకంగా మాట్లాడింది. "నా కెరీర్ ప్రారంభంలోనే ఆయనతో కలిసి పనిచేశాను. తెరపైనే కాదు, కెమెరా వెనుక కూడా ఆయన ఎంతో స్టైలిష్‌గా ఉంటారు. 15 ఏళ్ల క్రితమే ఆయన స్టైల్ వేరే లెవల్‌లో ఉండేది. ఈరోజు ఆయన సాధిస్తున్న విజయం చూస్తుంటే నాకు చాలా గర్వంగా, సంతోషంగా ఉంది" అని తన మనసులోని మాటను బయటపెట్టింది.

తిరుమలలో కేక్ రచ్చ.. దివ్వెల మాధురికి జాన్వీ కపూర్ మాస్ వార్నింగ్!

Next Story