బిజీ లైఫ్‌కు బ్రేక్ ఇచ్చి.. ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేస్తోన్న రష్మీ: మేకప్ లెస్ లుక్ వైరల్

by Disha Web Desk 9 |
బిజీ లైఫ్‌కు బ్రేక్ ఇచ్చి.. ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేస్తోన్న రష్మీ: మేకప్ లెస్ లుక్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: బుల్లితెర స్టార్ యాంకర్ రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ప్రస్తుతం ఈ భామ ‘ఎక్ట్ర్సా జబర్దస్త్’, ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ షోలకు యాంకర్‌గా వ్యవహరిస్తున్నారు. చిన్న పాత్రలతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. హీరోయిన్‌గా వరుస చిత్రాల్లో నటించారు. కానీ ఏ ఒక్క మూవీ కూడా విజయం సాధించలేకపోయింది. ఇక సుడిగాడి సుధీర్‌తో లవ్ ట్రాక్ గురించి తెలిసిందే. వీరి ఇద్దరి కెమిస్ట్రీతో ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంటారు. ఇటీవల రష్మీని మోసం చేసి సుధీర్ తన మరదలిని పెళ్లి చేసుకోబోతున్నట్లు నెట్టింట వార్తలు వినిపించాయి. ఇదంతా ఎంత వరకు నిజమో కాదో తెలియదు కానీ.. రష్మీ తన బిజీ లైఫ్‌కు కొంత విరామం ఇచ్చి.. తన స్నేహితులతో ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ యాంకర్ తన ఫ్రెండ్స్‌తో మేకప్ లేకుండా కలిసి దిగిన పిక్స్‌ను షేర్ చేసింది. దీంతో నెటిజన్లు... ‘మీరు వితౌట్ మేకప్ కూడా సూపర్ ఉన్నారు మేడమ్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ మేకప్ లెస్ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

Read More..

రోడ్డుపై కూతురితో సురేఖ వాణి హల్ చల్.. ‘కాంబో రేటు ఎంత’ నెటిజన్ వల్గర్ కామెంట్

Next Story

Most Viewed