పురుషులు కూడా ఈర్ష్యపడేలా.. సిక్స్‌ప్యాక్ బాడీతో షాకిచ్చిన తాప్సి

by Hamsa |
పురుషులు కూడా ఈర్ష్యపడేలా.. సిక్స్‌ప్యాక్ బాడీతో షాకిచ్చిన తాప్సి
X

దిశ, సినిమా : స్టార్ నటి తాప్సీ పన్ను మరో కొత్త అవతార్‌లో అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఇటీవలే సెమీ న్యూడ్ లుక్‌లో దర్శనమిచ్చిన ఆమె.. ఓ దేవత దండ మెడలో ధరించి తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. అయితే ఈసారి వివాదాల జోలికి వెళ్లకుండా మహిళలకే కాదు పురుషులు సైతం ఈర్ష్యపడేలా సిక్స్ బాడీతో నెటిజన్లను అట్రాక్ట్ చేసింది. ఇక ఇందుకు సంబంధించిన ఫొటోలను నెట్టింట షేర్ చేస్తూ.. ‘నెలల తరబడి కష్టపడి పనిచేయడం వల్ల నేను బిస్కెట్లు సంపాదించుకోగలిగాను. నన్ను ఇలా ప్రోత్సహించిన @sujeetkargutkarకు స్పెషల్ థాంక్స్. ఇన్ని రోజులు కప్పు టీతో సరిపెట్టుకున్నాను. ఇక ఇప్పుడు చోలే భతుర్, క్రోసెంట్‌లను తినడానికి బయలుదేరుతున్నా’ అంటూ అబ్స్ చూపిస్తూ సంతోషంగా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం వైరల్ అవుతున్న పిక్స్‌పై ‘నువ్వు మరో టైగర్ ష్రాఫ్‌. నీ ఫిట్‌నెస్ మాకెంతో స్ఫూర్తిదాయకం’ అంటూ ఫ్యాన్స్ పొగిడేస్తున్నారు.

ఇవి కూడా చదవండి: సూర్యకు ఆ స్టార్ హీరో గట్టి పోటీ ఇవ్వబోతున్నాడా!

Next Story

Most Viewed