అత్యాచార నిందితుడికి ప్రభుత్వ మద్ధతా? దేశం సిగ్గుపడుతోంది : Swara Bhasker.

by Disha Web Desk 10 |
అత్యాచార నిందితుడికి ప్రభుత్వ మద్ధతా? దేశం సిగ్గుపడుతోంది : Swara Bhasker.
X

దిశ, సినిమా: డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న రెజ్లర్లకు నటి స్వరా భాస్కర్ మద్దతు తెలిపింది. ఈ మేరకు మహిళలపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని రక్షించడం కోసం ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఆమె తప్పుపట్టింది. ‘మన ప్రభుత్వం దీన్ని ఇంత వరకు కొనసాగించడం నన్ను ఆశ్చర్యపరిచింది. దాని ఏజెన్సీలు కూడా అత్యాచార నిందితుడిని రక్షించబోతున్నాయి. ఖచ్చితంగా ఇది సిగ్గుచేటు!’ అంటూ ట్విట్టర్ వేదికగా అసంతృప్తి వ్యక్తం చేసింది. కాగా స్వర ట్వీట్‌పై స్పందించిన రెజ్లర్ సాక్షి మాలిక్.. ‘మా తలలు వేలాడదీయండి. భారతదేశం సిగ్గుపడాలి!’ అంటూ ఎమోషనల్‌గా రిప్లై ఇవ్వడం విశేషం. ప్రస్తుతం వైరల్ అవుతున్న పోస్ట్‌లకు నెటిజన్లు సపోర్టుగా నిలుస్తున్నారు.

Read More... శ్రద్ధా క్యారెక్టర్‌పై డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. వద్దన్నా ఫోన్ చేస్తుందట

Aamir Khan: ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన అమీర్.. అప్పుడే సినిమా అనౌన్స్ చేస్తాడట

శారీలో సెక్సీ డ్యాన్స్.. కండిషన్స్ పెట్టక తప్పలేదన్న రవీనా



Next Story

Most Viewed