Shraddha Kapoor క్యారెక్టర్‌పై డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. వద్దన్నా ఫోన్ చేస్తుందట

by Disha Web Desk 10 |
Shraddha Kapoor క్యారెక్టర్‌పై డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. వద్దన్నా ఫోన్ చేస్తుందట
X

దిశ, సినిమా: బ్యూటీఫుల్ యాక్ట్రెస్ శ్రద్ధా కపూర్ బిహేవియర్‌పై స్టార్ డైరెక్టర్ మోహిత్ సూరి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఆదిత్యరాయ్ కపూర్ హీరోగా ఆయన తెరకెక్కించిన ‘ఆషికీ 2’లో అందం, అభినయంతోపాటు ఎమోషనల్‌ ఫీలింగ్స్‌తోనూ ప్రేక్షకులను కట్టిపడేసింది శ్రద్ధా. అయితే ఈ సినిమా బిగ్ హిట్ అవడంతో నటికి ఫాలోయింగ్ పెరిగింది. కాగా దీనికి కృతజ్ఞతగా ప్రతి సంవత్సరం ఈ సినిమా రిలీజైన తేదినాడు తనకు ఫోన్ చేసి థాంక్స్ చెబుతుందని మోహిత్ తెలిపాడు. ‘సినిమా వార్షికోత్సవం రోజున ఆమె తప్పకుండా ఫోన్, మెసేజ్ చేస్తుంది. మూవీలో చాన్స్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతుంది. ఇది తన కెరీర్‌‌ను మలుపుతిప్పిన చిత్రంగా భావిస్తుంది. నిజానికి నటిగా ఇలా చేయాల్సిన అవసరం లేదు. కానీ, ఆమె మంచి మనస్తత్వం కలిగిన మనిషి అని చెప్పేందుకు ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్’ అంటూ నటిని మోహిత్ పొగిడేశాడు.

Read More... ‘SSMB28’ చిత్రంలో ప్రిన్స్ లుక్ అదిరిపోయిందిగా..

తెల్లటి దుస్తుల్లో ఎద అందాలతో మైమరపిస్తున్న నటి..



Next Story

Most Viewed