Surekha Vani: కూతురునే మించిపోయిన తల్లి.. Social Media ను షేక్ చేస్తున సీనియర్‌నటి

by Disha Web Desk 7 |
Surekha Vani: కూతురునే మించిపోయిన తల్లి.. Social Media ను షేక్ చేస్తున సీనియర్‌నటి
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు సురేఖ వాణి. తెలుగు తెరపైన ఎన్నో ప్రత్యేకమైన పాత్రలు పోషిస్తూ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది సురేఖ. అటూ సినిమాలతో బిజీగా ఉంటూనే.. సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్‌గా ఉంటుంది. తన కూతురితో కలిసి ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫొటోలు దిగుతూ.. రీల్స్ చేస్తూ వాటిని పోస్ట్‌ చేస్తుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ పోస్ట్ షేర్ చేసింది సురేఖ.

తన కూతురితో కలిసి మినీ డ్రెస్స్‌లు వేసి ఫొటోకు ఫోజులు ఇచ్చింది. ఈ ఫొటోలను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేయగా కొద్ది సేపటికే అవి కాస్త వైరల్‌గా మారి కుర్రాళ్లకు చెమటలు పట్టేలా చేస్తున్నాయి. ఆ ఫొటోస్ చూసిన నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. ''వీరిద్దరు తల్లికూతుర్లు అంటే ఎవరు నమ్మరు.. కూతురిని మించిన అందంలో తల్లి ఉందంటూ'' కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ ఫొటోలు కాకరేపుతున్నాయి.

ఇవి కూడా చదవండి : 'ఆదిపురుష్' మొబైల్స్‌లో కాదు థియేటర్లో చూడండి: ఓం రౌత్

Next Story

Most Viewed