'Adipurush' మొబైల్స్‌లో కాదు థియేటర్లో చూడండి: Om Raut

by Disha Web Desk 7 |
Adipurush మొబైల్స్‌లో కాదు థియేటర్లో చూడండి: Om Raut
X

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు భారీ చిత్రాలు చేస్తున్నాడు. అందులో ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసుకుని రిలీజ్‌కి సిద్ధమైన చిత్రం 'ఆదిపురుష్'. బాలీవుడ్ స్టార్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన ఈ సినిమా రామాయణం ఇతిహాసం ఆధారంగా రూపొందింది. అన్ని బాగుంటే ఈ సంక్రాంతి బరిలో నిలిచేది. కానీ, ఈ మూవీ టీజర్‌తో కథ మారింది. అందులోని వీఎఫ్‌ఎక్స్ చూసి జనాలు నవ్వుకున్నారు. రాముని లుక్ సరిగా లేదంటూ, రావణుడు ఇలా ఉంటాడా? హనుమంతుడు ఇలా కనిపిస్తాడా? అని నానా రకాలుగా ఎద్దేవ చేశారు. అయితే రీసెంట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శకుడు ఓం రౌత్ మాట్లాడుతూ.. 'ఈ సినిమాను మొబైల్స్ కోసం తీయలేదు. థియేటర్‌లో చూసేందుకు తీశాం. త్రీడీలో చూస్తే వచ్చే అనుభూతి వేరు' అంటూ చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి : ఆ విషయంలో కూతురునే మించిపోయిన తల్లి.. Social Media ను షేక్ చేస్తున సీనియర్‌నటి


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed