పిల్లల కోసమే సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నాం.. Sunny Leone

by Hajipasha |   (  Updated:2022-09-25 12:56:13  IST  )

మాజీ శృంగార తార, నటి Sunny Leone.. తన ఇంట్లో సోషల్ మీడియాను అస్సలు చూడమని చెప్పింది.

పిల్లల కోసమే సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నాం.. Sunny Leone
X

దిశ, సినిమా: మాజీ శృంగార తార, నటి సన్నీ లియోన్.. తన ఇంట్లో సోషల్ మీడియాను అస్సలు చూడమని చెప్పింది. ప్రస్తుతం ముగ్గురు పిల్లలు, భర్తతో కలిసి జీవిస్తున్న ఆమె.. ప్రజల్లో మమేకమై బతుకుతున్నప్పుడు పిల్లలను నిరంతరం పరిశీలిస్తుండాలనే విషయం ఇటీవలే అర్థంచేసుకున్నట్లు తెలిపింది. ఎందుకంటే పిల్లలు పెరిగేకొద్దీ సాధారణ స్థితిని కలిగి ఉండాలనే తపనతో తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని, అందుకే సోషల్ మీడియాను ఎట్టిపరిస్థితుల్లో అనుమతించకుండా నిబంధన పెట్టుకున్నట్లు చెప్పింది. 'ప్రస్తుతం చిన్నవారైన నా పిల్లలు నిషా, ఆషర్, నోహ్.. మా జీవితాన్ని అర్థం చేసుకోలేరు. అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇంకా కొంచెం సమయం ఉంది. పిల్లల శరీరాలు, మనసు, ఆలోచనలు మారుతున్నప్పుడు ఎవరికైనా ఆందోళన ఉంటుంది. అయితే ప్రపంచంలో ఏం జరుగుతోందనే దానిపై వారికి టెన్షన్ లేదు. కానీ ఇంట్లో మమ్మీ, డాడీ జీవితంలో జరుగుతున్న విషయాల గురించి ఆందోళన చెందుతారు. ముఖ్యంగా నా గురించి నెటిజన్లు చెడుగా మాట్లాడతారు కాబట్టి.. అది వాళ్ల దృష్టికొస్తే ప్రతికూలతలోకి వెళ్లిపోతారు. అందుకే అలాంటివి చూపించడానికి ప్లాన్ చేయట్లేదు' అంటూ చెప్పుకొచ్చింది.

Also Read : కూడు, గూడు లేక పదేళ్లు అవస్థలు పడ్డా.. బాలీవుడ్ నటి Shreya Dhanwanthary ఎమోషనల్

Next Story