కూడు, గూడు లేక పదేళ్లు అవస్థలు పడ్డా.. బాలీవుడ్ నటి Shreya Dhanwanthary ఎమోషనల్

by Dishanational4 |
కూడు, గూడు లేక పదేళ్లు అవస్థలు పడ్డా.. బాలీవుడ్ నటి Shreya Dhanwanthary ఎమోషనల్
X

దిశ, సినిమా: బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ శ్రేయా ధన్వంతరి.. మొదటి సినిమా రిలీజ్ అయ్యేంతవరకు 'హోమ్‌లెస్'గా ఉన్నట్లు తెలిపింది. ఆమె నటించిన తాజా చిత్రం 'చుప్ : రివెంజ్ ఆఫ్ ది ఆర్టిస్ట్' ఈ శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నటి.. వినోద పరిశ్రమలో అడుగుపెట్టేందుకు దాదాపు పదేళ్లు పోరాడినట్లు చెప్పింది. అలాగే ఆర్థిక ఇబ్బందుల వల్ల ఎన్నోసార్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని నిరాశ్రయుల జాబితాలో చేరిపోయినట్లు చెప్పింది.

ఇక ఇంజనీరింగ్ చదువు కోసం దుబాయ్, బహ్రెయిన్, ఖతార్‌లో ఉన్నప్పుడు ఆకలితో అలమటిస్తూ దారుణమైన జీవితాన్ని గడిపినట్లు భావోద్వేగానికి లోనైంది. ఈ క్రమంలోనే ఎలాగైనా నటిగా పని సంపాదించడంపై దృష్టి పెట్టాలని బలంగా నిర్ణయించుకున్నానన్న ఆమె.. ఇండియాకు తిరిగొచ్చి 'ఫెమినా మిస్ ఇండియా సౌత్' 2008లో పాల్గొని ఫైనలిస్ట్‌గా ప్లేస్ సంపాదించినట్లు తెలిపింది. దీంతో 2010లో 'స్నేహ గీతం' అనే తెలుగు చిత్రంలో కనిపించడం, ఆ తర్వాత 'వై చీట్ ఇండియా' మూవీతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టినట్లు వివరించింది.

Also Read : పిల్లల కోసమే సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నాం.. Sunny Leone


Next Story

Most Viewed