స్టార్ హీరోయిన్‌ను పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన సుధాకర్

by Disha Web Desk 9 |
స్టార్ హీరోయిన్‌ను పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన సుధాకర్
X

దిశ, వెబ్‌డెస్క్: ఒకప్పుడు తమిళంలో స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్నాడు సుధాకర్. తర్వాత తెలుగు ఇండస్ట్రీకి వచ్చాక తనదైన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. కాగా ఈ మధ్యకాలంలో మరణించినట్లు వార్తలు వచ్చినప్పటికీ స్వయంగా అతడే ‘నేను బతికే ఉన్నాను. నన్ను చంపకండి’ అంటూ క్లారిటీ ఇస్తూ కాస్త ఎమోషనల్ అయ్యారు. అయితే తాజాగా సుధాకర్ గురించి ఓ ఆసక్తికర వార్త నెట్టింట వైరల్‌గా మారింది. అప్పట్లో హీరోయిన్ రాధిక, సుధాకర్ ప్రేమించుకున్నారని వార్తలు వినిపించాయి. కానీ ఆమె కాకుండా ఈ కమెడియన్ హీరోయిన్ జయచిత్ర కూడా ప్రేమించాడట. ఆమె అందానికి అప్పటి స్టార్ హీరోలు చాలామంది వెంటపడేవారట.

కానీ ఎవరిని కూడా జయచిత్ర దగ్గరికి రానిచ్చేది కాదట. కేవలం సుధాకర్‌కు మాత్రమే ఆమె దగ్గరయ్యిందట. ఇక సుధాకర్ మాటలకి పడిపోయిన తను పెళ్లి చేసుకుంటానే వరకు వెళ్లిందట. కానీ ఒక రోజు సుధాకర్ క్రిస్టియన్ అమ్మాయిని చెన్నైలోని దుర్గా టెంపుల్‌లో వివాహం చేసుకోవడం చూసి జయచిత్ర చాలా బాధ పడిందట. కొన్ని రోజుల వరకు డిప్రెషన్‌లోకి వెళ్లిందట. తర్వాత ఆ బాధ నుంచి తేరుకొని ఎలాగైనా సుధాకర్ కంటే అందగాడిని పెళ్లి చేసుకోవాలని పంతంలో గణేష్ అనే వ్యక్తిని వివాహం చేసుకుని హ్యాపీగా ఉందని సమాచారం.

Also Read: భార్యకు దొరకకుండా ఆ పని చేసిన యాంకర్ రవి..పట్టేసుకున్న నెటిజన్స్?



Next Story

Most Viewed